twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తుఫాను బాధితుల కోసం రాజమౌళి ఇలా... (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హుద్‌హుద్‌ తుపాను బాధితులను ఆదుకోవాలని పిలుపుని ఇస్తూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ వీడియోని రూపొందించారు. షేర్ ది స్పిరిట్ ఆఫ్ దివాళి-వైజాగ్ నీడ్స్ యు టైటిల్ తో ఈ వీడియోని రూపొందించారు. అక్కడ ఉన్న మన సోదరులు కోలుకోవటానిక తలో చెయ్యి వేయాలని, తన వంతుగా ఈ వీడియోని రూపొందించాని అన్నారు. ఆ వీడియో లింక్ ఇదిగో...

    మరో ప్రక్క తుఫాన్ బాధితలను ఆదుకోవటం కోసం...టాలీవుట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఓ ఎగ్జిబిషన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను త్వరలో ఆడతామని, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఎం సహాయనిధికి అందజేస్తామని కథానాయకుడు శ్రీకాంత్‌ తెలిపారు. ఆదివారం విజయవాడలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ''తుపాను వల్ల ఉత్తరాంధ్రలో జన జీవనం అతలాకుతలం అయ్యింది. వారిని ఆదుకోవడానికి టాలీవుడ్‌ ప్రముఖులు వ్యక్తిగతంగా సాయమందించారు. బాధితులకు భారీ మొత్తంలో సాయం చేయాలనే తలంపుతో ఈ క్రికెట్‌ మ్యాచ్‌ ఆలోచన చేశామ''న్నారు.

    అలాగే..... ''హుద్‌హుద్‌ తుపాను ప్రభావంతో నష్టపోయిన సినీ కుటుంబాలను దత్తత తీసుకొని అవసరమైన సాయం చేస్తాన''ని ప్రకటించారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు. ఇప్పటికే విశాఖపట్నంలో సినీ రంగానికి చెందిన బాధిత కుటుంబాల వివరాల్ని సేకరించే పనిని ప్రారంభించినట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా కుటుంబాలకు నేరుగా సహాయాన్ని అందజేస్తానని తెలిపారు. తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో చిత్ర పరిశ్రమ చూపిన చొరవ అభినందనీయమని మెచ్చుకొన్నారు దాసరి.

    Rajamouli short video for Hudhud relief

    ''తమను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు ఎలాంటి కష్టం కలిగినా ఆదుకోవడానికి మేమున్నామంటూ చిత్ర పరిశ్రమ ముందుకొస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విరాళాల సేకరణకు పూనుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కథానాయకులు, సాంకేతిక నిపుణులు మరింత వేగంగా స్పందించి ఎవరికి వారే స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తూ బాధితుల్లో మనోధైర్యాన్ని నింపారు. పవన్‌కల్యాణ్‌ రూ. 50 లక్షలు సాయం ప్రకటించడంతో పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం అభినందనీయం.

    తమిళ సినీ రంగానికి చెందిన సూర్య, కార్తి, విశాల్‌లాంటి కథానాయకులు స్పందించి సాయం ప్రకటించారు. ఇతర చలన చిత్ర సంస్థలన్నీ ముందుకొచ్చి బాధితులకు అండగా నిలిచాయి. ఈ సందర్భంగా సినీ కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు'' అని ప్రకటనలో పేర్కొన్నారు దాసరి.

    సచిన్‌ రూ.15 లక్షలు: తుపాను బాధితుల సహాయార్థం రూ. 15 లక్షలు విరాళంగా ప్రకటించారు కథానాయకుడు సచిన్‌ జోషి. ''నన్ను ఎంతో అభిమానించే తెలుగు ప్రజలకు ఇలాంటి కష్టం రావడం బాధకి గురిచేసింద''న్నారాయన. తుపాను బీభత్సం చూసి తట్టుకోలేకపోయాననీ, ఉత్తరాంధ్ర జిల్లాలు త్వరగా కోలుకోవాలని సచిన్‌ ఆకాంక్షించారు.

    English summary
    Rajamouli who known for his helping nature came with an innovative short film which was titled as 'Share the Spirit of DIWALI- Vizag Needs YOU’’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X