SS Rajamouli బాహుబలి నిర్మాతలతో రాజమౌళి కొడుకు సినిమా.. అంతకు మించి అంటూ ఊరిస్తూ..!
రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ రాజమౌళి డైరెక్ట్ చేసే దాదాపు అన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఆయన గతంలో నిర్మాతగా ఒక సినిమా మొదలుపెట్టి మధ్యలోనే ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన ప్రేమలు అనే సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా మారి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. ఆసక్తికర అంశం ఏమిటంటే ఈరోజు అధికారికంగా ఆయన మొదటి సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతుందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం.
ఆకాశవాణితో...
రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ రాజమౌళి డైరెక్ట్ చేసే దాదాపు అన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ పనులన్నీ తానే చూసుకుంటూ ఉంటాడు. బాహుబలి సమయం నుంచి ఆయన తన కుటుంబంతో కలిసి ఈ ప్రొడక్షన్ పనుల్లో భాగమౌతూ వస్తున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఆయన ఆకాశవాణి అనే సినిమాతో నిర్మాతగా మారాలని అనుకున్నాడు.

ప్రేమలుతో సక్సెస్
నిజానికి అధికారికి ప్రకటన కూడా వచ్చింది కూడా. అయితే అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తవుతుంది అనుకుంటే కరోనా కారణంగా అనేకసార్లు వాయిదా పడుతూ రావడంతో రెండింటిని మేనేజ్ చేయలేక ఆయన ఆకాశవాణి సినిమా నుంచి తప్పుకున్నాడు. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే ప్రేమలు అనే మలయాళ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

కార్తికేయ పోస్ట్...
కార్తికేయ షేర్ చేసిన పోస్టులో... ''నేను డిస్ట్రిబ్యూటర్ గా చేసిన మొదటి సినిమాకి తెలుగు ఆడియన్స్ ఇంత ప్రేమ చూపించారు. ఈ ప్రేమను చూస్తే నాకు ఒకటే నమ్మకం కలిగింది. అదే మంచి సినిమాకి ఎలాంటి భాషా బేధాలు ఉండవని. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడంలో ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేశాను. ఫుట్ ఫాల్స్ చెక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క టికెట్ తెగుతున్నప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇంకా గుర్తుందియ అలాగే ఒక హౌస్ ఫుల్ థియేటర్ గురించి సమాచారం తెలిసినప్పుడు వచ్చే ఆనందం వేరే లెవెల్ అంటూ ఆయన రాసుకువచ్చాడు.
గత ఏడాది ఆస్కార్ అవార్డులు ఆర్ఆర్ఆర్ సినిమాకి వరించినప్పుడు నేను ఎంత ఆనందం ఫేస్ చేశాను. ఈ సమయంలో కూడా అంతే ఆనందం చూస్తున్నాను. ఈ ఆనంద సమయంలో నేను మరో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, అదే నేను నిర్మాతగా ఒక మంచి సినిమా చేయబోతున్నాను. రెండేళ్ల నుంచి స్క్రిప్ట్ కోసం సమయం వెచ్చించి ఇప్పటికీ ఒక కొలిక్కి తీసుకొచ్చాం. ఎట్టకేలకు ఒక సినిమాగా మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఒక అధికారికి ప్రకటన చేయబోతున్నానని రాసుకొచ్చాడు.
అప్పుడే క్లారిటీ...
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సైతం ఒక ఆసక్తికరమైన ప్రకటన మేము చేయబోతున్నామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాబట్టి వీరిద్దరూ సహానిర్మానంలో ఒక సినిమా రాబోతుందని భావించవచ్చు. అయితే ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు డైరెక్ట్ చేసేది ఎవరు లాంటి విషయాలను అధికారిక ప్రకటన తర్వాత మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











