అతి త్వరలో.. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దర్నీ కూర్చోబెట్టి, స్పీడు పెంచుతున్న రాజమౌళి!

రాజమౌళి, రాంచరణ్, రామారావు కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ చిత్రం గురించి సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి వెండితెర పంచుకోనుండడం, వారిద్దరిని రాజమౌళి డైరెక్ట్ చేయనుండడం అత్యంత ఆసక్తికరమైన అంశం. రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ ఇదివరకే నటించారు. రాంచరణ్ మగధీర చిత్రం, ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ వంటి చిత్రాలని తెరకెక్కించింది దర్శక ధీరుడే. రాంచరణ్, ఎన్టీఆర్ వ్యతిగతంగా కూడా మంచి రిలేషన్ మైంటైన్ చేయడంతో రాజమౌళి తన తదుపరి చిత్రానికి వీరిద్దరిని ఎంపిక చేసుకున్నాడు. తాజగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త వెలువడింది.

Recommended Video

Rajamouli multistarrer Movie Heroine Gets Finalised
జాతీయ స్థాయిలో

జాతీయ స్థాయిలో

ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రంపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. బాహుబలి తరువాత జక్కన్న ఖ్యాతి నలుదిశలా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి కథతో రాబోతున్నాడు, ఎంత బడ్జెట్ పెట్టనున్నారు వంటి అంశాలు ఆసక్తిగా మారాయి.

 ప్రకటన మాత్రమే

ప్రకటన మాత్రమే

రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ నటించనున్నట్లు ప్రకటన మాత్రమే వెలువడింది. అంతకు మించి చిత్ర విశేషాలు ఏమీ వెల్లడించలేదు. ఇటీవల రాంచరణ్ మాట్లాడుతూ రాజమౌళి ఇంకా కథ కూడా చెప్పలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇద్దరూ బాగా బిజీ

ఇద్దరూ బాగా బిజీ

రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బిజీగా గడుపుతున్నారు. రాంచరణ్ బోయపాటి చిత్రంలో నటిస్తుండగా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాంచరణ్ హైదరాబాద్ తిరిగి వచ్చాడు. అరవింద సమేత చిత్ర షూటింగ్ కూడా నగరంలోనే జరుగుతోంది.

అతి త్వరలోనే

అతి త్వరలోనే

ఎన్టీఆర్, రాంచరణ్ కు కథ వివరించడానికి రాజమౌళి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఎన్టీఆర్, చరణ్ ని కూర్చోబెట్టి కథ వివరించబోతున్నాడని సమాచారం. ఇక సమయం వృధా చేసే ఉద్దేశంలో రాజమౌళి లేదు. కథని లాక్ చేసి నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X