విఎన్ ఆదిత్య దర్శకత్వంలో రాజమౌళి..

By Staff

Rajamouli
దర్శకులు నటులుగా తెరపై కనపడటం సినీ ప్రపంచానికి కొత్తేం కాదు. భాగ్యరాజా,దాసరి వంటి వారు ప్రధానపాత్రలు,హీరోలుగా కూడా కనిపించి అలరించారు. కానీ ఈ తరంలో ఆ తరహా సరదా ఉన్న వాళ్ళు కరువయ్యారు. ఇప్పుడది క్రేజీ డైరక్టర్ యస్‌యస్ రాజమౌళిలో కనపడుతోంది. ఆ మధ్యన కొద్ది రోజుల క్రితం మాటీవీలో ప్రసారమయ్యే 'యువ' సీరియల్‌లో కనిపించిన ఈ టాప్ డైరెక్టర్ తాజాగా ఒక సినిమాలో నటించాడు. అది విఎన్ ఆదిత్య రూపొందిస్తున్న 'రెయిన్‌బో' చిత్రం. అలాగే ఇంకా ఈ సినిమాలో శ్రీనువైట్ల, కోడి రామకృష్ణ ,సముధ్ర, కోదండరామిరెడ్డి గెస్ట్ రోల్స్ లో తమ నిజ జీవిత పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమాను శ్రీ సిద్ధార్థ మూవీస్ బానర్‌పై ఆదిత్య స్వయంగా నిర్మిస్తున్నాడు. భరత్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో రాజమౌళి తన నిజ జీవిత పాత్ర సినీ దర్శకుడిగా రెండు మూడు సన్నివేశాల్లో కనిపిస్తాడు. కథ ప్రకారం సినిమాల్లో నటించాలని తపించే హీరోయిన్ అవకాశం కోసం సినీ డైరెక్టర్ అయిన రాజమౌళిని కలుస్తుంది. ఆ హీరోయిన్ పాత్రను సోనాల్ చౌహాన్ చేయగా, హీరోగా 'హ్యాపీడేస్' ఫేమ్ రాహుల్ (టైసన్) నటించాడు. రెండవ హీరోయిన్‌గా సింధు మీనన్ కనిపిస్తుంది.

జూలై 9న విడుదల కానున్న 'రెయిన్‌బో'కు బలభద్రపాత్రుని రమణి కథనీ, పరుచూరి బ్రదర్స్ మాటల్నీ అందించారు. గాయకుడు నిహాల్ ఈ సినిమాతో సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నాడు. మరి ఈ సినిమా క్లిక్ అయితే మరికొంత మంది దర్శకులు ఈ బాటలో నడవొచ్చు. అలాగే తర్వాత రాజమౌళికి నటునిగా మరిన్ని అవకాశాలు రావచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X