twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహానటి’ క్రెడిట్ ఆయనకివ్వడం ఏమిటి? కోపం వచ్చింది: రాజమౌళి హాట్ కామెంట్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Rajamouli Speech In Mahanati Success Meet

    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బేనర్లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న, ప్రియాంక నిర్మించిన చిత్రం 'మహానటి'. ఇటీవల విడుదలైన ఈ బయోపిక్ అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక గొప్ప సినిమా వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 'మహానటి' టీంను అభినందిస్తూ నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి హాజరైన బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికరంగా ప్రసంగించారు. దర్శకుడు అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు అతన్ని చూస్తే ఈర్ష్య కలుగుతోందంటూ వ్యాఖ్యానించారు.

     క్రిడిట్ ఆయనకివ్వడమేంటి? కోపం వచ్చింది

    క్రిడిట్ ఆయనకివ్వడమేంటి? కోపం వచ్చింది

    అరవింద్‌గారు ఫోన్ చేసి మహానటి ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా, నా ఫ్రెండ్ దత్ గారిని పిలిచి పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ఆయనతో పాటు యూనిట్ అందరినీ పిలుస్తున్నాను అనగానే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఎందుకు కోపం వచ్చిందంటే సినిమా చేసింది దత్ గారి పిల్లలు. యూనిట్ అందరూ కష్టపడి సినిమా చేస్తే మీరు మీ ఫ్రెండుకు క్రెడిట్ అంతా ఇచ్చేయడం ఏం బాగోలేదండీ అని చెప్పాను. అంత టాలెంట్ ఉన్న పిల్లల్ని కన్నందుకు దత్ గారిని తప్పకుండా అభినందిస్తాను అని చెప్పాను. అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం యంగ్ టీమ్ కే దక్కుతుంది.. అని రాజమౌళి వ్యాఖ్యానించారు.

    ఇలాంటి రేర్ హిట్స్ ఎప్పుడో ఒకసారే

    ఇలాంటి రేర్ హిట్స్ ఎప్పుడో ఒకసారే

    సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తాయి. కానీ ఇండస్ట్రీని మొత్తం కదిలించే, అందరి నోటా హాట్ టాపిక్ అయ్యేవి కొన్ని మాత్రమే వస్తాయి. గతేడాది అర్జున్ రెడ్డి వచ్చింది, ఈ ఏడాది మహానటి వచ్చింది. అశ్విన్ ఇలాంటి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని రాజమౌళి అన్నారు.

    విడుదల ముందు ఈ సినిమా మీద నమ్మకం లేదు

    విడుదల ముందు ఈ సినిమా మీద నమ్మకం లేదు

    వాస్తవంగా చెబుతున్నాను... సినిమా రిలీజ్ ముందు నాలుగైదు రోజుల వరకు ఈ సినిమా మీద నాకు పెద్దగా అభిప్రాయంకానీ, నమ్మకం కానీ లేదు. సినిమా చూడాలనే ఆసక్తి కూడా లేదు. అయితే మా ఇంట్లో ఉన్న వారు, నా చుట్టుపక్కల ఉన్న వారు టికెట్లు బుక్ చేయడం, దీనికి గురించి ఆసక్తికరంగా మాట్లాడుకోవడంతో సినిమా బావుంటుందా? అనే ఆలోచన నాలో మొదలైంది. వారి వల్లే చూడాలనే ఆసక్తి ఏర్పడిందే తప్ప నా అంతట నాకు సినిమాపై ఆసక్తి కలగలేదు... అని రాజమౌళి తెలిపారు.

     ప్రతి సీన్ గురించి ఆయనతో మాట్లాడాలని ఉంది

    ప్రతి సీన్ గురించి ఆయనతో మాట్లాడాలని ఉంది

    థియేటర్లోకి వెళ్లిన తర్వాత నేను ఊహించిన దానికంటే చాలా గొప్పగా ఉంది. సినిమాలో కీర్తి సురేష్ సావిత్రిలా ఉండటం అనేది ఒక చిన్న ప్లస్ పాయింట్ అంతే. ఆమె అద్భుతంగా సావిత్రి పాత్రను పోషించారు. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ రాసిన స్క్రిప్టు, సినిమాను తెరకెక్కించిన విధానం, యాక్టర్స్ తో చేయించుకున్న విధానం పెంటాస్టిక్ గా ఉంది. ప్రతి సీన్ గురించి ఆయనతో మాట్లాడాలని ఉంది.... అని రాజమౌళి తెలిపారు.

    జెమినీ గణేశన్ విలన్, సావిత్రి విక్టిమ్... కానీ

    జెమినీ గణేశన్ విలన్, సావిత్రి విక్టిమ్... కానీ

    ప్రజల్లో జెమినీ గణేశన్ ఒక విలన్.... సావిత్రి విక్టిమ్ అనే ఒక ఆభిప్రాయం ఉంది. చరిత్ర ఎలా ఉన్నా సినిమాటిక్ గా తీసినపుడు ఒక హీరో, ఒక విలన్ ఉండాలి. జెమినీ గణేశన్‌ను విలన్ గా చూపించడం అనేది చాలా ఈజీ స్క్రిప్టింగ్.... కానీ ఆయన్ను అలా చూపించకుండా వాస్తవంగా ఏం జరిగింది? అనేది చూపిస్తూ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను నడపటం ఈ సినిమాకు బిగ్గెస్ట్ హైలెట్. ఒక పెళ్లయిన వాన్ని సావిత్రి లాంటి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంది? ఎలా కన్విన్స్ అయింది అనేది నా బుర్రకు ఇప్పటి వరకు తట్టలేదు. దీన్ని సినిమాలో చూపించిన విధానం చాలా బావుంది అని రాజమౌళి ప్రశంసించారు.

    జెమినీ గణేశన్ పిలాసఫీ, సావిత్రికి మందు అలవాటు చేయడంపై

    జెమినీ గణేశన్ పిలాసఫీ, సావిత్రికి మందు అలవాటు చేయడంపై

    సావిత్రికి జెమినీ గణేశన్ మందు అలవాటు చేశారు అనేది అందరికీ తెలిసిందే. ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనేది సినిమాలో ఫెంటాస్టిక్ గా చూపించారు. చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా బాగా చూపించారు. జెమినీ గణేశన్ ఫిలాసఫీ చూపించిన విధానం కూడా చాలా నచ్చింది. ‘నాకు అవసరం ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నాకు ఇంకొకరితో ఎఫైర్స్ ఉండటం అనేది నా వీక్ నెస్. నా ప్రేమ మాత్రం నీదే, నిన్నే ప్రేమిస్తున్నాను' అని జెమినీ గణేశన్ చెప్పిన విషయాన్ని నాగ్ అశ్విన్ బాగా చూపించారు... అని రాజమౌళి తెలిపారు.

     నాగ్ అశ్విన్‌ను చూస్తే ఈర్ష్య కలుగుతోంది

    నాగ్ అశ్విన్‌ను చూస్తే ఈర్ష్య కలుగుతోంది

    ఇలాంటి గొప్ప సినిమా మాకు అందించినందుకు అశ్విన్‌కు థాంక్స్. నేను చాలా ఎంజాయ్ చేశాను, ఇంకా ఆ సీన్లు తలుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా రేర్ గా నాకు డైరెక్టర్ల మీద జలస్ కలుగుతూ ఉంటుంది. ఇలాంటి థాట్ నాకు రాలేదే ... ఇలా నేను చేయగలనా? లేదా? అనిపిస్తూ ఉంటుంది. నాగ్ అశ్విన్ ను చూస్తే నాకు జలస్ వేస్తుంది, ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టును చాలా ఫెంటాస్టిక్ గా తీశారు అని రాజమౌళి ప్రశంసించారు.

    English summary
    Rajamouli Speech At Mahanati Success Celebrations. Popular producer Allu Arvind, who owns Geetha Arts, hosted a private party for the makers of Mahanati to celebrate the success of the film, which was a sweet gesture from the veteran producer. The party was attended by producers Aswini Dutt, Swapna Dutt and Priyanka Dutt along with director Nag Ashwin. Actor Allu Arjun too graced the party and posted a picture on his social networking page late in the night yesterday. Baahubali director S.S.Rajamouli too attended the event along with music composer M.M.Keeravani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X