ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీ రెడీ.. షూటింగ్ మొదలెట్టేశారు.. అదే పనిలో ఉన్న రాజమౌళి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను నేడు రాజమౌళి మొదలెట్టేశాడు. దాదాపు ఏడు నెలల గ్యాప్ తరువాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను పున: ప్రారంభించాడు. ఇక ఎన్నో రోజుల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఘట్టం ఏ క్షణానైనా రావొచ్చని అంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

ఎన్టీఆర్‌కు గిఫ్ట్..

ఎన్టీఆర్‌కు గిఫ్ట్..

రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ భీం చేత అల్లూరి సీతారామరాజు టీజర్ రిలీజ్ చేయించారు. అందులో అల్లూరిగా రామ్ చరణ్ కనిపించగా.. భీంగా ఎన్టీఆర్ వినిపించాడు. ఈ దెబ్బకు ఇద్దరి సత్తాను ఒకే సారి చూపించాడు. అయితే ఎన్టీఆర్ బర్త్ డేకు కూడా ఇలాంటి గిఫ్ట్ రెడీ చేద్దామని అనుకున్నారు.

కరోనాతో తారుమారు..

కరోనాతో తారుమారు..

ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ పెండింగ్‌లో ఉండటం.. కరోనాతో లాక్ డౌన్ రావడం షూటింగ్‌లు ఆగిపోవడంతో షెడ్యూల్ తారుమారైంది. అలా యంగ్ టైగర్ అభిమానులకు ఆ స్పెషల్ ట్రీట్ మిస్ అయింది. అయితే ఎన్టీఆర్ టీజర్‌కు సంబంధించి రాజమౌళి ఆ మధ్య అదిరిపోయే ప్రకటన చేశాడు.

వెంటనే ఆ పని..

వెంటనే ఆ పని..

ఎన్టీఆర్ టీజర్ గురించి రాజమౌళి చెబుతూ.. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ చేస్తే.. మొదటగా ఎన్టీఆర్‌కు సంబంధించి షూటింగ్ పార్ట్ పూర్తి చేసి అప్డేట్ ఇస్తామని మాటిచ్చాడు. అయితే ఆ తరుణం రానే వచ్చిందని తెలుస్తోంది. నేటి ఉదయం నుంచి హైద్రాబాద్‌లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభించారని తెలుస్తోంది.

లాంగ్ షెడ్యూల్..

లాంగ్ షెడ్యూల్..

ఇది లాంగ్ షెడ్యూల్ అని, దాదాపు రెండు నెలల పాటు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుందట. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయని సమాచారం. ఈ షూటింగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటారని తెలుస్తోంది.

Recommended Video

Vijay Ram, Shivasakthi@Amaram Akhilam Prema Music Launch Event- Part 02
ఏ క్షణాన అయినా..

ఏ క్షణాన అయినా..

రామ్ భీంకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏ క్షణాన అయినా రావొచ్చని టాక్. అది సస్పెన్స్‌లో ఉండిపోయింది. మొత్తానికి ఎన్టీఆర్ పార్ట్ కంప్లీట్ చేసి టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషీ చేయాలని జక్కన్న ప్లాన్ అట. ఆ తరుణం మరెంతో దూరంలో లేదని తెలుస్తోంది. అక్టోబర్ మూడో వారంలోపు ఈ టీజర్ రెడీ అవుతుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X