ఎన్నాళ్ళగానో ఊరిస్తూ వస్తున్న రాజమౌళి,సునీల్ కాంబినేషన్ సినిమా ఏప్రియల్ ప్రారంభం కానుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. లొ బడ్జెట్ లో నిర్మితమయ్యే ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సెటైర్ చేస్తూ కథ ఉంటుందని చెప్తున్నారు. రాజమౌళి తన రెగ్యలర్ హింస,శృంగారం స్కీమ్ కు కొంచెం దూరంగా వెళ్ళి సినిమా చేస్తాడని అంటున్నారు. అలాగే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ,కాజల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు రెడీ అయింది. ఆ సినిమాలోనూ సునీల్ కి కాంబినేషన్ గా కాజల్ ని ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ కాంబినేషన్ ఉండకపోవచ్చనని ఫిల్మ్ నగర్ న్యూస్. అంతేగాక ఈ స్క్రిప్టు స్నేహంతో త్రివిక్రమ్ చూస్తాడనీ,బంతి టైటిల్ ఉండవచ్చునని చెప్పుకుంటున్నారు.