రాజమౌళి, సునీల్ సినిమా స్టార్ట్

ఈ చిత్రం గురించి రాజమౌళి చెపుతూ నేను ఎప్పుడో ఈ బ్యానర్ లో సినిమా చెయ్యాల్సి ఉంది. అందుకోసం అప్పట్లో రెండు లక్షల నూట పదహారు రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. కానీ ఆ అవకాశం ఇంతకాలానికి కానీ రాలేదు. అలాగే ఈ చిత్రంలో నా రెగ్యులర్ సినిమా నుంచి బయిటకు వచ్చి చేస్తున్నా. అలాగని ఆర్ట్ సినిమా మాత్రం కాదు. నేను లవ్ స్టోరీలు తీయలేను. ఇది ఓ కామిడీ ధ్రిల్లర్. నా ప్రెండ్ వర ముళ్లపూడి(నా అల్లుడు డైరక్టర్) ఈ స్టోరీ లైన్ చెప్పారు. అప్పుడు సునీల్ ఈ కధకు కరెక్టుగా సరిపోతాడనిపించింది. రాయలసీమ నేపధ్యంలో ఈ కథ సాగినా ఫ్యాక్షన్ మాత్రం ఉండదు. రాయలసీమ అతిధి మర్యాదలకు పేరు పడింది. అక్కడ జరిగే అతిధి మార్యాదలే ప్రధానాంశంగా ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో సునీల్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. కానీ చూసేవాళ్లకు కామెడీ పంచుతుంది.
ఇక సునీల్ ఈ సినిమా గురించి చెపుతూ అందాలరాముడు చిత్రం తర్వాత ఎన్నో కథలు విన్నాను కానీ నేను ఎగ్జైట్ అయ్యే కథ ఎవరూ చెప్పలేకపోయారు. దాంతో హీరోగా మళ్ళి చేయలేదు. అయితే ఈ కథ విన్నాను..చాలా ఆనందంగా ఉంది రాజమౌళితో చేయటం అన్నారు. జూలై, ఆగస్టులలో ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ చిత్రంలోని ఐదు పాటలను కీరవాణి సంగీతం అందిస్తునారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఛోటా కె.నాయుడు కెమెరా అందిస్తూంటే, కాంచి ఈ చిత్రానికి కథ, రవీందర్ ఆర్ట్ డైరక్షన్, రమా రాజమౌళి స్టైలింగ్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











