బహిష్కరించండి: మోడీకి మద్దతుగా రాజమౌళి
హైదరాబాద్: సమాజానికి ఉపయోగ పడే మంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుండే దర్శకుడు రాజమౌళి....తాజా ప్రధాని మోడీ చేస్తున్న స్వదేశీ ప్రచారానికి మద్దతు పలికారు. మోడీ సందేశాన్ని తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా షేర్ చేసారు. రాజమౌళి షేర్ చేసిన ఈ విషయానికి మంచి స్పందన వస్తోంది.
‘మరో రెండు నెలల్లో దీపావళి పండగ వస్తోంది. ప్రతి ఏటా మన దేశంలో దీపావళికి చైనా తయారు చేస్తున్న డెకరేషన్ లైట్స్ రూ. 300 కోట్ల మేర అమ్ముడవుతున్నాయి. దీని వల్ల చైనా వారు ధనవంతుల అవుతున్నారు. మనదేశ తయారీ దారులకు ఆకలిచావులే మిగిలుతున్నాయి. డియర్ భారత్ వాసి...స్వదేశి వస్తువులను కొనండి. విదేశీ వస్తువులను బహిష్కరించండి. మన దేశ ఆర్థిక ప్రగతిని పెంచండి. మన దేశ పేదల టాలెంటును ప్రోత్సహించండి' అంటూ మోడీ షేర్ చేసిన సందేశాన్ని రాజమౌళి తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా షేర్ చేసారు.

రాజమౌళి ప్రస్తుతం బాహుబలి చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంతగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇండియాతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు కాబట్టి తెలుగు సినిమా చరిత్రలో రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టే తొలి సినిమా ఇదే అని అంటున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం తాజాగా షెడ్యూల్ మహాబేలేశ్వర్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ మళ్లీ రాజమోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కంటిన్యూ చేయనున్నారు. 2015లో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











