జూ ఎన్టీఆర్ మనుసులో మాట..అది రాజమౌళికి ఒక్కడికే సాద్యం....
జూ ఎన్టీఆర్ ఈరోజు ఇంత పెద్ద స్టార్ అయ్యాడంటే అందుకు కారణం రాజమౌళియే అని చెప్పక్కర్లేదు. రాజమౌళితో చేసిన మూడు సినిమాలతో జూ ఎన్టీఆర్ చాలా ఎత్తుకి ఎదిగాడు. రాజమౌళిటా అతడిని ఉపయోగించుకున్న దర్శకులు ఇంకెవరూ లేరు. వివి వినాయక్ కూడా జూ ఎన్టీఆర్ తో మంచి సినిమాలు చేసినా రాజమౌళి రేంజ్ కి అవి సరితూగలేవు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఏదీ ఎన్టీఆర్ కి అంతగా నచ్చడం లేదట. తన ఖాతాలో పెద్ద హిట్ సినిమా వచ్చి చాలా కాలం గడిచినపోవడంతో ఎన్టీఆర్ అర్జంటుగా ఒక భారీ హిట్టివ్వాలని ఉవ్విళ్లూరుతున్నాడట.
అయితే అది కేవలం రాజమౌళికి తప్ప వేరొకరికి సాద్యపడదని అతనికి తెలుసు, అందుకే ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే రాజమౌళిని తనతో సినిమా చేయమని ఎన్టీఆర్ కోరగా, ఇప్పట్లో కుదరదని చెప్పేశాడట. ఈగ, ప్రభాస్ సినిమాల తర్వాత మహేష్ తో సినిమా చేస్తానని, ఆ తర్వాతే నీతో చేయగలనని అన్నాడట. ఇదంతా అయ్యేసరికి కనీసం మూడేళ్లు గడిచిపోతుంది కాబట్టి ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడట. రాజమౌళి మీద అలిగా అతనితో మాట్లాడం లేదట. ఒకే దర్శకుడిని నమ్ముకుని కూర్చుంటే ఎలా బుడ్డోడా? స్టయిల్ మార్చూ..!


Click it and Unblock the Notifications











