తొలి అరగంటలోనే హీరో చనిపోతాడు: రాజమౌళి

By Srikanya

rajamouli
సినిమా ప్రారంభమైన తొలి అరగంటలోనే హీరో చనిపోతాడు. అతని ఆత్మ... ఓ 'ఈగ'లో వాలుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలు. చిన్న ఈగ బలవంతుణ్ని ఎలా ఎదుర్కొంది? అసలు ఈగ పగకు కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ ఆసక్తికరం. వినోదం, ఉత్కంఠత మేళవించి చూపిస్తున్నాం. ఇందులో హృద్యమైన ప్రేమ కథ ఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. మూడు పాటలున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. ఆయన తాజా చిత్రం 'ఈగ'గురించి రాజమౌళి గురించి చెబుతూ ఇలా స్పందించారు. అలాగే ...బలవంతుడైన ప్రతినాయకుడిని ఎదుర్కోవాలంటే కథానాయకుడికి కనీసం ఆరు పలకల దేహం ఉండాలి. రెండు చేతుల్లో అధునాతన ఆయుధాలుండాలి.

ఎత్తుకు పైఎత్తులు వేసేంత తెలివితేటలు కావాలి. ఇన్ని ఉన్నా... ప్రతినాయకుడిని పడగొట్టాలంటే పతాక సన్నివేశాల వరకూ ఆగాలి. ఇవేమీ లేకుండానే చిన్న కీటకం.. ఓ బలవంతుడి కొమ్ములు విరిచింది. అదెలాగో తెలియాలంటే మా 'ఈగ' సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఇక 'ఈగ'లో నాని, సమంత జంటగా నటిస్తున్నారు. కన్నడ నటుడు సుదీప్‌ కీలక పాత్రధారి. కొర్రపాటి సాయి నిర్మాత. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తారు.ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సంగీతం: కీరవాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X