హాలీవుడ్ కథల్ని తీసుకోవచ్చు...సిగ్గు పడద్దు: రాజమౌళి
హాలీవుడ్ కథల్ని స్ఫూర్తిగా తీసుకోవడం బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ ఉన్నదే. మూలాన్ని పాడు చేయనంత వరకూ సిగ్గు పడాల్సిన పని లేదు. మూలాన్ని తీసుకొని మనకు అనుగుణంగా మార్చుకొని ఒప్పించగలగాలి. ఇక 'మర్యాద రామన్న' కీ ఆంగ్ల చిత్రం 'అవర్ హాస్పటాలిటీ'కీ పోలికలు ఉన్నాయనేది నిజమే. కథ అక్కడ్నుంచి తీసుకున్నదే. సన్నివేశాలు మాత్రం కొత్తవే. అయితే కొంతమంది మాత్రం ఇది కాపీ అంటున్నారు. ఎవరేమన్నా నాకు మాత్రం తప్పుగా అనిపించడం లేదు అంటున్నారు ప్రముఖ దర్శకులు రాజమౌళి. ఆయన తాజాగా ఓ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. అలాగే పైరసీ అరికట్టడానికి సహకరించమని...చెప్తూ...వెబ్ సైట్ లలో 'మర్యాద రామన్న' సినిమా పైరసీ కాకుండా ఆపడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ దాదాపు 380 టొరెంట్ లింక్స్‌ని తొలగించామని చెప్పారు.


Click it and Unblock the Notifications











