»   » ‘బాహుబలి’ పార్ట్-2లో మార్పులు ఉండొచ్చన్న రాజమౌళి

‘బాహుబలి’ పార్ట్-2లో మార్పులు ఉండొచ్చన్న రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం ఇలా విడుదలైన ప్రతి చోటా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. రికార్డు స్థాయిలో కేవలం 5 రోజుల్లోనే 230 కోట్లుపైగా వసూలు చేసింది. రాజమౌళి పేరు ఇండియా వ్యాప్తంగానే కాదు...అంతర్జాతీయ స్థాయిలో మార్మోగి పోతోంది.

బాహుబలి సినిమా తొలి భాగం చూసిన ప్రేక్షకులు..... రెండో భాగం ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూసే విధంగా అద్భుతంగా తెరకెక్కించాడు రాజమౌళి. సినిమా విజయం అనంతరం రాజమౌళి, రానా, ప్రభాస్ మళ్లీ ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. తాజాగా ఆయన బాలీవుడ్ టాప్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


 Rajamouli talks about Baahubali 2 script changes

ఈ సందర్భంగా రాజీవ్ మసంత్ బాహుబలి పార్ట్ 2కు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. బాహుబలి 2లో ఏమైనా మార్పులు చేస్తారా? అనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ అసవరం అయితే బాహుబలి 2 కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తామన్నారు.
మొదటి వారం రెస్పాన్స్ అదిరిపోయింది. టీం మొత్తం చాలా హ్యాపీగా ఉంది. అయితే సినిమాకు అసలైన టాక్ ఏమిటి అనేది 4వ వారం పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. దాన్ని బట్టి కథలో మార్పులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.


ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బాహుబలి' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన 5 రోజుల్లోనే దాదాపు 230 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 స్థానంలో నిలవడంతో పాటు బాలీవుడ్లో పలు రికార్డులను తుడిచి పెట్టింది. బాహుబలి వసూళ్ల ప్రభంజనం ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో ఊహించనంతగా సాగుతోంది.

English summary
Rajamouli talks about Baahubali 2 script changes. Rajamouli said that genuine feedback can only be felt in the film’s fourth week run and that he will make changes if any, based on the overall response.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu