ఆయన్ను బీట్ చేయడమే లక్ష్యంగా రాజమౌళి?
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన రాజమౌళి త్వరలో 'ఈగ' అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. భారీ విజువల్ ఎపెక్టులతో, యానిమేషన్ క్యారెక్టర్లతో ఈ సినిమా రూపొందించ బడుతోంది. ఇటీవల విడుదలై ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు ఓ రేంజ్ లో ఉండటంతో.....రాజమౌళి ఓ టార్గెట్ పెట్టుకుని మరీ ముందుకు సాగుతున్నారనే ప్రచారం టాలీవుడ్ లో మొదలైంది.
జయాపజాల సంగతి పక్కన పెడితే....ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విజువల్ ఎఫెక్టు సినిమా అంటే 'అనగనగా ఓ ధీరుడు'. సిద్ధార్థ, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా విజయం సాధించలేక పోయింది. అయితే ఇందులో ఉపయోగించిన గ్రాఫిక్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. గ్రాఫిక్స్ నేపథ్యంలో గతంలో చాలా తెలుగు సినిమాలు వచ్చినా ఈ సినిమా కింద దిగదుడుపే అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్.
తాజాగా రాజమౌళి ఈగ చిత్రాన్ని భారీ విజువల్ ఎఫెక్టులతో రూపొందిస్తున్నారు. ప్రకాష్‌ను బీట్ చేయాలని కంకణం కట్టుకున్న రాజమౌళి 'ఈగ' చిత్రం కోసం భాగా కష్ట పడి పని చేస్తున్నాడని అంటున్నారు. రాజమౌళి గురించి తెలిసిన చాలా మంది ఆయన ఖశ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాడని అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో? చూడాలి. ఈగ చిత్రం నాని, సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











