»   » రోజుకు 25 లక్షల ఖర్చు, కోపంతో అరిచే వాడిని, నెక్ట్స్ ఫ్యామిలీ మూవీ: రాజమౌళి

రోజుకు 25 లక్షల ఖర్చు, కోపంతో అరిచే వాడిని, నెక్ట్స్ ఫ్యామిలీ మూవీ: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-ది కంక్లూజన్' ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి అండ్ టీం సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. తాజాగా హిందీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

బాహుబలి సినిమా అనేది ఒక బిగ్ డ్రీమ్. ఇంత పెద్ద ప్రాజెక్టు కేవలం నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎంతో మంది నటీనటుల, టెక్నీషియన్స్ ఎఫర్టు పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ సినిమాను చాలెంజ్ గా తీసుకుని చేసారని రాజమౌళి తెలిపారు.


నిర్మాతలు అన్ని ఇచ్చారు కానీ, అందుకు ఒప్పుకోలేదు

నిర్మాతలు అన్ని ఇచ్చారు కానీ, అందుకు ఒప్పుకోలేదు

నిర్మాతలు నేను ఏది అడిగితే అది ఇచ్చారు. ఖర్చుకు వెనకాడకుండా అన్ని సమకూర్చారు. ఎక్కడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. అయితే రిలీజ్ డేట్ ఓ వారం వాయిదా వేద్దం అంటే మాత్రం అస్సలు ఒప్పుకోలేదు అని రాజమౌళి తెలిపారు.


హలీవుడ్ సినిమాలతో పోల్చలేం

హలీవుడ్ సినిమాలతో పోల్చలేం

హాలీవుడ్లో మార్వెల్ స్టూడియోస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు తీసే సినిమాలతో బాహుబలిని పోల్చలేం. వాటి బడ్జెట్ లెవల్స్ చాలా హైరేంజిలో ఉంటాయి. మార్వెల్ చిత్రాలతో పోలిస్తే టెక్నికల్ కూడా బాహుబలికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అని రాజమౌళి తెలిపారు.


ఆ విషయం గర్వంగా చెబుతున్నా

ఆ విషయం గర్వంగా చెబుతున్నా

హాలీవుడ్ సినిమాలతో బడ్జెట్ పరంగా, టెక్నికల్ అంశాల పరంగా పోటీపడలేక పోయినా.... ఒక విషయం మాత్రం గర్వంగా చెప్పగలను. కథ పరంగా, క్యారెక్టర్స్ పరంగా మన బాహుబలి చాలా రిచ్ గా ఉంటుంది అని రాజమౌళి తెలిపా


రోజుకు 25 లక్షల ప్రొడక్షన్ కాస్ట్

రోజుకు 25 లక్షల ప్రొడక్షన్ కాస్ట్

బాముబలి షూటింగ్ ఒక రోజు షూటింగ్ కాస్ట్ 25 లక్షలు, రోజుకు 8 గంటలు వర్కింగ్ అవర్స్ వేసుకున్నా గంటకు 3 లక్షల ఖర్చు. ఒక గంట వేస్ట్ చేస్తే 3 లక్షలు నష్టమే. ఇది నాపై చాలా ప్రెషర్ పెంచింది అని రాజమౌళి తెలిపారు.


కొన్ని సార్లు అరిచేవాడిని

కొన్ని సార్లు అరిచేవాడిని

దర్శకుడిగా నేను టీంను సరిగా మేనేజ్ చేయక పోతే డబ్బు వేస్ట్ అవుతుంది, తప్పు నాదే అవుతుంది. అందుకే ఏదైనా తేడా జరిగితే కొన్ని సార్లు కోపం వచ్చేది, ఆలస్యం అయితే అరిచే వాడిని. అయితే నామీద ఉన్న ప్రెషర్ అర్థం చేసుకుని కాస్ట్ అండ్ క్రూ చాలా సపోర్ట్ చేసారు అని రాజమౌళి తెలిపారు.


డబ్బు వేస్ట్ అవుతుందని వర్రీ ఉండేది కాదు

డబ్బు వేస్ట్ అవుతుందని వర్రీ ఉండేది కాదు

నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ....రాజమౌళి ఏదైనా సీన్లు మళ్లీ చేద్దాం, రీటేక్ లు చేద్దాం అంటే మేము డబ్బు వేస్ట్ అవుతుందని వర్రీ అయ్యే వారం కాదు. ఎందుకంటే డబ్బు కంటే ప్రొడక్షన్ క్వాలిటీ పెరగాలని ఆలోచనతో ఖర్చు పెట్టామని తెలిపారు.


తొలి భాగంలో లాభాలు రాలేదు

తొలి భాగంలో లాభాలు రాలేదు

బాహుబలి తొలి భాగం రిలీజ్ వల్ల నిర్మాతలుగా మాకు పెద్దగా లాభం రాలేదు. సెకండ్ పార్టులో తప్పకుండా లాభాలు వస్తాయని భావిస్తున్నాం. మా ఐదేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని భావిస్తున్నాం అని శోభు యార్లగడ్డ తెలిపారు.ప్రభాస్, రానా సపోర్ట్

ప్రభాస్, రానా సపోర్ట్

బాహుబలి ప్రాజెక్టు విషయంలో ప్రభాస్, రానా తమకు కావాల్సినన్ని డేట్స్ ఇచ్చారు. ప్రభాస్ అయితే మరే సినిమాకు కమిట్ అవ్వకుండా కేవలం బాహుబలి ప్రాజెక్టుకే అంకితం అయ్యాడు. ఇలాంటి ఎఫర్టు పెట్టే యాక్టర్స్ దొరకడం వల్లే బాహుబలి సినిమా విజయవంతంగా పూర్తి చేయగలిగామని రాజమౌళి తెలిపారు.


సూట్ కేసుల కొద్ది డబ్బుతీసుకొచ్చి ఖర్చు పెట్టారు

సూట్ కేసుల కొద్ది డబ్బుతీసుకొచ్చి ఖర్చు పెట్టారు

బాహుబలి ప్రాజెక్టు విషయంలో ముందుగా నేను థాంక్స్ చెప్పుకునేది మా నాన్నకే. ఆయన ఇలాంటి కథను, క్యారెక్టర్లు నాకు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ లాంటి నిర్మాతలు లేకుంటే ఈ ప్రాజెక్టులు లేదు. నాపై నమ్మకంతో సూట్ కేసుల కొద్ది డబ్బుతీసుకొచ్చి ఖర్చు పెట్టారు అని రాజమౌళి తెలిపారు.


నెక్ట్స్ ఫ్యామిలీ ఎంటర్టెనర్

నెక్ట్స్ ఫ్యామిలీ ఎంటర్టెనర్

బాహుబలి 2 విడుదల తర్వాత కొంతకాలం హాలిడే తీసుకుంటాను. తర్వాత ఫ్యామిలీ ఎంటర్టెనర్ చేస్తాను అని రాజమౌళి తెలిపారు.


English summary
Check out Rajamouli and team Baahubali 2 interview. Baahubali 2 - The Conclusion is part a two part Indian movie, directed by S.S. Rajamouli. The film will be released in Telugu, Tamil, Hindi, Malayalam, as well as several other International languages simultaneously. Part 1, Baahubali - The Beginning released on the 10th of July, 2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu