రగ్బీ ప్రచార బృందంలో నన్ను... : రాజమౌళి
హైదరాబాద్ : నితిన్ తో రూపొందించిన 'సై' సినిమాతోమనది కాని క్రీడ రగ్బీ చుట్టూ ఓ కథ అల్లి.. ప్రేక్షకుల్ని మెప్పించారు ఎస్.ఎస్.రాజమౌళి, . దాదాపు తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రాజమౌళి గుర్తుచేసుకొన్నారు. ఈ సినిమా ద్వారా రగ్బీ క్రీడకు ప్రాచుర్యం తీసుకురావడానికి ఏర్పాటు చేసిన బృందంలో నన్ను తీసుకోవాలని తనను సిఫార్సు చేశారంటూ తెలియచేసారు.
రాజమౌళి మాట్లాడుతూ... ''సై సినిమా గురించి ఓ ఉత్సాహవంతమైన విషయం మీతో పంచుకోవాలనిపిస్తోంది. విల్లీ హతెర్కా ఇండియన్‌ఆర్మీ రగ్బీ కోచ్‌గా పనిచేస్తున్నారు. ఆయన 'సై' సినిమా చూశారు. ఆయన న్యూజిలాండ్ దేశస్థుడు. ఇంగ్లిష్ కూడా సరిగా రాదు. కానీ 'సై' సినిమా కథనీ, అందులోని భావోద్వేగాలనూ బాగా అర్థం చేసుకోగలిగారు. సినిమా ఆయనకు బాగా నచ్చింది. రగ్బీ ప్రపంచ వ్యాప్తంగా 144 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది. మనదేశంలో అంత గుర్తింపు లేదు. ఈ క్రీడ ప్రచారం కోసం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మూడు సినిమాల్ని ఎంచుకొన్నారు. అందులో 'సై' కూడా ఉంది. ఈ క్రీడకు ప్రాచుర్యం తీసుకురావడానికి ఏర్పాటు చేసిన బృందంలో నన్ను తీసుకోవాలని ఆయన సిఫార్సు చేశారు..'' అంటూ రాజమౌళి పేర్కొన్నారు.
ఇక ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ కేరళలో జరుగుతోంది.
ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.
ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












