twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా నెగెటివ్ కానీ ఇంకో మూడు వారాలు.. జక్కన్న ట్వీట్ వైరల్

    |

    దర్శకధీరుడు రాజమౌళికి కరోనా వైరస్ సోకిందన్న సంగతి తెలిసిందే. రాజమౌళికే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరక జక్కన్న స్వయంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. తనకు, కుటుంబానికి కొన్ని రోజులుగా జ్వరం ఉందని, టెస్ట్ చేయించుకోగా కరోనా పాజివ్ వచ్చిందని, అందుకే క్వారంటైన్‌కు వెళ్తున్నామని జూలై 29న ప్రకటించాడు. అయితే తాజాగా జరిపిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని తెలిపాడు.

    రాజమౌళి తన ఆరోగ్యంపై ఇచ్చిన ప్రకటన అందరిలోనూ ఆనందాన్ని నింపింది. కరోనా నుంచి కోలుకోవడం పట్ల జక్కన్న అభిమానులు సంతోషంలో తేలిపోతోన్నారు. కరోనా నుంచి కోలుకున్నామని జక్కన్న చెబుతూ.. 'రెండు వారాల క్వారంటైన్‌ పూర్తయింది.ఎటువంటి లక్షణాలు లేవు.. దీంతో మరోసారి నిర్వహించిన పరీక్షల్లో మా అందరికి కరోనా నెగిటివ్‌ వచ్చింది. అవసరమైన మేర యాంటీబాడీలు వృద్ధి చెంది ప్లాస్మా డొనేట్‌ చేయడానికి ఇంకో మూడు వారాలు వెయిట్ చేయాలని వైద్యులు సూచించారు.' అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.

     Rajamouli Test Corona negative

    కరోనా నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని, వాటి ఆవశ్యకత ఏంటి? అనేది చిరంజీవి, మహేష్ బాబు లాంటి వారంతా మీడియా ముఖంగా వివరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి సైతం ఆనాడు ఇదే చెప్పాడు. కరోనా పాజిటివ్ అని తెలిశాక.. యాంటీ బాడీస్ వృద్ది చెందాక ప్లాస్మా దానం చేసేందుకు మళ్లీ తిరిగివస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Rajamouli Test Corona negative. Completed 2 weeks of quarantine! No symptoms. Tested just for the sake of it... It is negative for all of us... Doctor said we need to wait 3 weeks from now to see if we've developed enough antibodies for plasma donation!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X