పవన్ ‘షాడో’ యూనిట్ ని సర్ ఫ్రైజ్ చేసిన రాజమౌళి..!
అది కోల్ కతా నగరం మధ్యలో ఓ లొకేషన్... అక్కడ విష్ణువర్ధన్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న 'షాడో' సినిమా షూటింగ్ జరుగుతోంది... ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్కడ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రత్యక్షమయ్యారు. దాంతో యూనిట్ అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇంతకీ, విషయం ఏమిటంటే, ఇటీవల రాజమౌళి తన కుటుంబసభ్యులతో కలిసి కాళీమాత దేవాలయం సందర్శనార్ధం కోల్ కతా వెళ్లారు. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతుండడంతో సరదాగా నిన్న ఆ సెట్స్ కి వెళ్లి కాసేపు గడిపివచ్చారు.
ఈ సందర్భంగా సినిమా స్టిల్స్ ని రాజమౌళీకి చూపించారు. 'పవన్ కల్యాణ్ ఫెంటాస్టిక్ గా ఉన్నాడంటూ ఆయన కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. 'విష్ణు ఈ షాడో సినిమా బాగా తీస్తున్నారు. ఆ విషయం స్టిల్స్ చూస్తేనే తెలిసిపోయింది. కోల్ కతా నగరంలో మన తెలుగు సినిమా షూటింగ్ చూడడం థ్రిల్ అనిపించింది. విష్ణువర్ధన్ తమిళ్ సినిమాలు తీస్తున్నా మన తెలుగు కుర్రాడే' అంటున్నాడు రాజమౌళి. అన్నట్టు, ఆయన వెళ్లిన రోజున పవన్ కల్యాణ్ మాత్రం షూటింగ్ లో లేడట!


Click it and Unblock the Notifications











