»   » కరణ్ జోహార్‌తో రాజమౌళి బాలీవుడ్ మూవీ..!

కరణ్ జోహార్‌తో రాజమౌళి బాలీవుడ్ మూవీ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాతో దేశ వ్యాప్తంగా ఫాపులర్ అయిన రాజమౌళి వీలైనంత త్వరలో బాలీవుడ్ సినిమా చేస్తానని తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ఈ విషయమై స్పందించారు. బాహుబలి తర్వాత బాలీవుడ్ నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయన్నారు.

భవిష్యత్తులో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తో కలిసి హిందీ సినిమాకు పని చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తాను బాహుబలి-2 చిత్రం షూటింగులో బిజీగా ఉన్నట్లు తెలిపిన ఆయన.... ప్రస్తుతానికైతే బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు, బాలీవుడ్లో సినిమా ఎప్పుడు చేస్తానో ఇప్పుడే చెప్పలేను అన్నారు.

Rajamouli To Direct Karan Johar's Bollywood film

బాహుబలి-2 షూటింగ్‌ను డిసెంబర్లో మొదలైంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో యూ ఎస్ షెడ్యూల్‌కు వెళ్ళనున్న రాజమౌళి అండ్ టీం ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి ది బిగినింగ్‌కు సీక్వెల్‌గా బాహుబలి ది కంక్లూజన్ అనే చిత్రం తెరకెక్కుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోండగా, దీనిపై జక్కన్న తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు. కంక్లూజన్ అనేది సీక్వెల్ కాదని, ఒకే కథని రెండు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

బాహుబలి చిత్రానికి మూడో భాగం కూడా ఉంటుందని, దీనికి , తొలి రెండు భాగాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి తెలిపారు. ఇప్పటి వరకు బాహుబలి 3 చిత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోని రాజమౌళి ఇటీవల వెల్లడించడం విశేషం.

English summary
Director S S Rajamouli says he will soon direct a bollywood film in near future.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu