విక్రం సినిమాకు రాజమౌళి దర్శకత్వం!
అపరిచితుడు సినిమా తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. అపరిచితుడు సినిమాతో విక్రం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడుగా మారిపోయాడు. తెలుగులో ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించని విక్రం ఉబ్బి తబ్బిబ్బై అనేక సార్లు హైదరాబాద్ వచ్చి మీడియాతో ముచ్చటించారు. ఆ ఆనందంలోనే ఆయన తెలుగులో ఒక ్రస్టెయిట్ సినిమా తీస్తానని ప్రకటించారు. తనకు నచ్చిన ముగ్గురు తెలుగు డైరెక్టర్ల పేర్లను కూడా ఆయన వెల్లడించారు. ఆ ముగ్గురు వివి వినాయక్, గుణశేఖర్, ఎస్‌ఎస్ రాజమౌళి. ఆయన ఫైనల్‌గా రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. రాజమౌళి చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చినట్టు సమాచారం. రాజమౌళి తన సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ కింద ఈ సినిమాను నిర్మించబోవడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయన నిర్మాణ, దర్శకత్వంలో ఒక సినిమా సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. అయితే రాజమౌళి మొదట విక్రం సినిమా చేస్తారో, ఎన్టీఆర్ సినిమా చేస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











