రాజమౌళి 'నెంబర్ వన్'
హీరోల్లో నంబర్ వన్ రేసు వున్నట్టే మన దర్శకుల మధ్య కూడా టాప్ ప్లేస్ కోసం నిత్యం పోటీ జరుగుతూనే వుంది. 'పోకిరి' చిత్రానికి ముందు పూరీ జగన్నాథ్, రాజమౌళిల మధ్య "నువ్వా నేనా" అనేలా పోటీవుండేది. అయితే 'పోకిరి' చిత్ర సంచలన విజయంతో పూరీ ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయాడు. దీనికి బదులుగా అన్నట్టు వచ్చిన రాజమౌళి సినిమా 'యమదొంగ' విజయవంతమైనప్పటికీ 'పోకిరి'ని అధిగమించలేక పోయింది.
దీంతో పూరీ ముందంజలో వున్నారు. కానీ ఈ మధ్య విడుదలైన 'మగధీర' సినిమా పోకిరి చిత్ర రికార్డులను తొలి మూడు వారాల్లోనే అధికమించడంతో పాటు, ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకే చెందుతుందనే ప్రశంసలు వినబడుతున్నాయి. దీంతో రాజమౌళి అందరి కంటే ఎంతో ఎత్తులో నిలబడి తానే 'నెంబర్ వన్' అనిపించుకున్నాడు. మరి పూరీ రాజమౌళిని ఎప్పుడు అధికమిస్తాడో చూడాలి.
rajamouli poori jagannath magadheera ram charn kajal pokiri neninte ravi teja రాజమౌళి పూరీ జగన్నాథ్ పోకిరి యమదొంగ మగధీర రామ్ చరణ్ కాజల్


Click it and Unblock the Notifications