'రాజన్న' కోసం ఫైట్ మాస్టర్ గా మారిన రాజమౌళి...!
తెలంగాణ పోరాటయోధుడిగా నాగార్జున నటిస్తున్న 'రాజన్న' చిత్రం చివరి షెడ్యులు షూటింగు ఈ రోజు (శుక్రవారం) నుండి హైదరాబాదు పరిసరాల్లో జరుగుతుంది. నెలాఖరు వరకు జరిగే ఈ షూటింగులో క్లైమాక్స్ దృశ్యాలను భారీ ఎత్తున చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కి దర్శకుడు రాజమౌళి నేతృత్వం వహిస్తారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. తండ్రి కోసం రాజమౌళి ఫైట్ మాస్టర్ గా మారి నాగార్జున తో ఫైట్ చేస్తున్నాడు.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునే నిర్మిస్తున్నారు. తెలంగాణా చారిత్రిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి షూటింగ్ నిర్వహించారు. స్నేహ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











