రాజమౌళిపై ఆ హీరోయిన్ అసంతృప్తి?
అక్కినేని నాగార్జున తాజా సినిమా 'రాజన్న' మంచి టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఓ చారిత్రక ఘటనను ఆధారం చేసకుని రూపొందించారు. రాజన్న చిత్రానికి దర్శకుడు విజయేంద్ర వర్మే అయినప్పటికీ....యాక్షన్ పార్టుతో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలు మాత్రం ప్రముఖ దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేశారు.
రాజన్న భార్యగా నటించిన స్నేహది ఇందులో పరిమిత పాత్రే అయినప్పటికీ ఉన్నంత వరకు బాగా ఆకట్టుకుంది. వాస్తవానికి సినిమాలో స్నేహ పాత్ర మరింత నిడివి ఉండాల్సి ఉన్నా....రాజమౌళి ఎడిటింగులో కట్ చేయించాడనే వార్త వినిపిస్తోంది. ఇప్పటికే సరైన అవకాశాలు లేక సతమతం అవుతున్న స్నేహ...రాజమౌళి తీరుపట్ల అసంతృప్తిగా ఉందట. రాజమౌళి ఇలా చేయడం పట్ల తనకేమీ బాధగా లేదని, నాగార్జున తనకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడమే అదృష్టంగా భావిస్తున్నట్లు తన్ని సన్నిహితులతో అంటోందట.


Click it and Unblock the Notifications











