»   » బిలియనీర్ ప్రశంస: పొంగి పోయిన రాజమౌళి అండ్ టీం

బిలియనీర్ ప్రశంస: పొంగి పోయిన రాజమౌళి అండ్ టీం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన వార్ మూవీ తెరకెక్కించారంటూ ‘బాహుబలి' దర్శకుడు రాజమౌళికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రముఖ బిజినెస్‌మేన్ల నుండి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

మహీంద్ర అండ్ మహీంద్రా సంస్థల అధినేత, భారత బిలియనీర్లలో ఒకరైన ఆనంద్ మహీంద్ర ‘బాహుబలి' సినిమా చూసి అనంతరం స్పందిస్తూ... బాహుబలి సినిమా అచ్చమైన ఇండియన్ మూవీలా ఉంది. హాలీవుడ్ స్థాయిలో ఉందే కానీ హాలీవుడ్ చిత్రాలను అనుకరించినట్లు అనిపించలేదు. రాజమౌళి టేకింగ్ అద్భుతం అంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే.


Rajamouli tweet about Anand Mahindra appreciation

ఆనంద్ మహీంద్ర ప్రశంసలపై రాజమౌళి స్పందించారు. ఆయనకు థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు. మీ ప్రశంస బాహుబలి టీంలో మరింత ఉత్తేజాన్ని నింపింది అంటూ రాజమౌలి ట్వీట్ చేసారు. రాజమౌళి ట్వీట్ కు వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్ర బాహుబలి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను, ఆలస్యం చేయొద్దు ట్వీట్ చేసారు.English summary
"anandmahindra thanks a lot sir. Your appreciation brought warmth into the hearts of our whole team.." Rajamouli tweeted.
Please Wait while comments are loading...