‘అర్జున్ రెడ్డి’ చూసిన రాజమౌళి, రానా.... ట్వీట్లతో మరింత హైప్!
అర్జున్ రెడ్డి మూవీపై రాజమౌళి స్పందించారు. సినిమా చాలా బావుందని ప్రశంసించారు. విజయ్ దేవరకొండ నటనను మెచ్చుకున్నారు.దర్శకుడు సందీప్ రెడ్డి టాలెంటును అభినందించారు.
Recommended Video

తెలుగు సెల్యులాయిడ్‌పైకి సంచలనంలా దూసుకొచ్చింది 'అర్జున్ రెడ్డి' మూవీ. ఇండస్ట్రీలో ఇపుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. అప్పట్లో 'శివ'... ఇపుడు 'అర్జున్ రెడ్డి' తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఓ వైపు సినిమాపై ప్రశంసలు.... మరో వైపు సినిమాలో చాలా బూతు ఉందంటూ విమర్శలు ఇలా 'అర్జున్ రెడ్డి' విషయంలో దేనికదే హైలెట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాను చూసిన దర్శక బాహుబలి రాజమౌళి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రాజమౌళి కామెంట్
‘అర్జున్ రెడ్డి' సినిమాపై రాజమౌళి స్పందిస్తూ.... తాను ఈ రోజు అర్జున్ రెడ్డి సినిమాను చూశాను, విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉంది, ఆయన నటనలో జీవించాడు' అంటూ రాజమౌళి ప్రశంసలు గుప్పించారు.

హీరోయిన్ షాలిని గురించి
హీరోయిన్ షాలిని చాలా బాగా చేసింది. ఆమె ప్రీతి పాత్రలో చాలా బాగా ఆమిడిపోయిందని రాజమౌళి అన్నారు. హీరోయిన్ తో పాటు పాటు ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా చాలా నేచురల్‌గా నటించారని రాజమౌళి కొనియాడారు.

బ్లాక్ బస్టర్
‘అర్జున్ రెడ్డి' మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది అని రాజమౌళి డిక్లేర్ చేశారు. రాజమౌళి స్థాయి దర్శకుడు ఒక సినిమాను బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేశారంటే మామూలు విషయం కాదు. రాజమౌళి కామెంట్లతో సినిమా చూసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

దర్శకుడిపై రాజమౌళి ప్రశంసలు
సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బావుంది, ఫోటోగ్రఫీ ఫైన్. ‘అర్జున్ రెడ్డి' సినిమాలోని డైలాగులు అద్భుతంగా ఉన్నాయి.. ఈ క్రెడిట్ అంతా ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డికే దక్కుతుంది. కాస్ట్ అండ్ క్రూను ఒక ప్రొఫెషనల్‌లాగా హ్యాండిల్ చేశాడు అని రాజమౌళి కామెంట్ చేశారు.

రానా
‘అర్జున్ రెడ్డి' సినిమాపై హీరో రానా కూడా స్పందించారు. ‘ఫైనల్ గా అర్జున్ రెడ్డి సినిమా చూశాను. సెకండ్ ఆఫ్ లో చిన్న లోపాలున్నా...విజయ్ దేవరకొండ అవుడ్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టాడు' అంటూ రానా ప్రశంసించాడు.


Click it and Unblock the Notifications











