»   » ‘బాహుబలి’ ప్రోమో కాపీ ఆరోపణపై రాజమౌళి స్పందన

‘బాహుబలి’ ప్రోమో కాపీ ఆరోపణపై రాజమౌళి స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన 'బాహుబలి' చిత్రం మేకింగ్ వీడియో.....కామిక్ ఎపిక్ అనే ప్రోమోను పోలి ఉంది. దాంతో ఆ ప్రోమోను మక్కికి మక్కి కాపీ కొట్టారని మీడియాలో ప్రచారం జరిగింది. వెంటనే చిత్రం నిర్మాత శోభు తన ట్వీట్ ద్వారా అలాంటిదేమీ లేదని ..తమకు లైసెన్స్ ఉందని, ఆ టెంప్లెట్ ని ఎవరన్నా కొనుక్కోవచ్చుని తెలిపారు. అది కాపీ కాదు. మేము అనుకున్నదానికి ఆ వీడియో టెంప్లెట్ బాగా సరిపోతుందని కొనుగోలు చేసామని చెప్పారు. ఈ నేపధ్యంలో కొన్నిఛానెల్స్ రెండు వీడియో టీజర్స్ ఓ దానితో మరొకటి పోల్చి చూపుతూ పోగ్రామ్స్ చేసాయి. ఇవి రాజమౌళికి ఆగ్రహాన్ని తెచ్చాయి.

రాజమౌళి ట్వీట్ చేస్తూ... మేము టీజర్ లో వాడిన వీడియో టెంప్లేట్ రైట్స్ కొనుగోలు చేసాం. వాటిని. ఎవరైనా కొనుక్కుని ఉపయోగించుకోవచ్చు. ఆ రెండు టెంప్లేట్ లను ప్రక్క ప్రక్కనే చూపుతూ కాపీ అంటూ చేసిన ఓ టీవీ పోగ్రామ్ ని చూసాను. వాళ్లు విజువల్స్ తో పాటు మా మ్యూజిక్ ని వాడారు. దాంతో చాలా మంది.. ఆ టెంప్లేట్ నుంచి ఆ సంగీతం కాపీ కొట్టామని భావిస్తున్నారు. వారు మరింత భాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

కాపీ,ఇన్సిప్రేషన్ కొత్త కాదు...అలాగే రాజమౌళి గత చిత్రాలు కూడా ఈ వివాదం ఎదుర్కొన్నాయి. మర్యాదరామన్న,ఈగ చిత్రాల సమయంలో కాపీ వివాదం చెలరేగాయి. అయితే సక్సెస్ వేడిలో అవి నిలబడలేదు. కానీ ఈ సారి సినిమా ప్రారంభంలోనే అంటే టీజర్ స్ధాయిలోనే ఈ ప్రచారం మొదలైంది. రాజమౌళి అభిమానులు...కొని వాడుకోవటం కాపీ కాకపోయినా..ఆయనంతటి గొప్ప క్రియేటర్ ఇలా చేయటం ఏంటి అని బాధపడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ను రిఫెరెన్స్ గా తీసుకుని వేరే విధంగా ప్రయత్నిస్తే క్రియేటివిగా బాగుండేమో అంటున్నారు.

ఈ మేకింగ్ వీడియో వారం గడవక ముందే 1 మిలియన్(10 లక్షలు) హిట్స్ సొంతం చేసుకుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

ఈ చిత్రంలో సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
SS Rajamouli tweeted: "We purchased the rights to video template which was used in the teaser. Anyone can buy it and use it. I saw a tv programme which said we copied showing our teaser and the template side by side. They used our music for the combined visual. Many are thinking the music is copied from that template. Wish they had been more responsible".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu