బాహుబలి విడుదలపై రాజమౌళి స్పందన (వీడియో)
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. అనుష్క, రానా, తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'బాహుబలి-2' ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఆర్కెస్ట్రా సెషన్స్ ని ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో సంగీత దర్శకుడు కీరవాణి సారధ్యంలో జరుగుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిమిత్తం ఈ సెషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి రీరికార్డింగ్ లో రియలిస్టిక్ సౌండ్స్ కోసం ఫిలిఫీ వెన్ లీర్ వంటి ప్రఖ్యాతి చెందిన కళాకారులు పనిచేస్తున్నారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు వెంట్రుకలు నిక్కుపెడుచుకునేలా రీరికార్డింగ్ ని చేయటానకి కీరవాణి ఏర్పాట్లు చెస్తున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











