twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీన్ సీరియస్: టికెట్ల విషయమై రాజమౌళి కామెడీ ట్వీట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చత్రపతి సినిమాలో కాట్రాజ్ తన వాళ్లని హింసిస్తుంటే.....ప్రభాస్ ఆవేశంతో ఊగిపోతాడు. ఎవరు చెప్పినా వినకుండా కాట్రాజ్ అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు. ఆ సీన్ ఎంత సీరియస్‌గా ఉంటుందో సినిమా చూసిన వారందరికీ తెలుసు. అయితే ఈ సీన్‌ను కామెడీ యాంగిల్‌లో బాహుబలి టికెట్ల‌పై అంశంపై ప్రయోగించాడు రాజమౌళి.

    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఏ సినిమా ఏర్పచలేనంత ఆసక్తి ప్రేక్షకుల్లో వచ్చేలా చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాకలో గతంలో ఏ సినిమా కూడా విడుదల కానన్ని థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతుండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వివిధ భాషల్లో 4000 థియేటర్లలో విడుదలవుతోంది.

    సినిమా ఇప్పటికే అంచనాలకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు అన్ని థియేటర్లలో అడ్వాన్డ్స్ బుకింగ్ ఇస్తున్నారు. టికెట్స్ అన్ని ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయి పోయాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు కనీసం 15 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    Rajamouli tweet about Baahubali tickets

    ఇతర ఏరియాల్లో 5 కోట్ల వరకు షేర్ వస్తుందని అంచనా. ఇక యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 800k నుండి 1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని అంచనా. మరో వైపు ఈ చిత్రానికి కర్ణాటకలో ఈచిత్రానికి సంబందించిన టికెట్స్ రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో అక్కడ వసూళ్లు భారీగానే ఉండొచ్చని అంటున్నారు.

    సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే... తొలి వారం 65 కోట్ల వసూలు చేయొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం గత రికార్డులను, అంచనాలను బద్దలు కొడుతూ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాహుబలి తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే స్తాయిలో ఫలితాలు సాధించాలని ఆశిద్దాం.

    English summary
    Rajamouli Funny tweet about Baahubali tickets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X