బైబై రైన్.. బైబై క్లౌడ్.. బైబై ఫాగ్ : రాజమౌళి
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి యూనిట్ హైదరాబాద్ తిరిగొచ్చేస్తోంది. గత కొంతకాలంగా మహాబలేశ్వర్‌లో జరుగుతున్న బాహుబలి షెడ్యూల్ మంగళవారంతో ముగిసింది. మళ్లీ ఈ నెల 12 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ... 'బైబై రైన్.. బైబై క్లౌడ్.. బైబై ఫాగ్.. బైబై మహాబలేశ్వర్'' అన్నారు.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. ప్రసాద్ దేవినేని, శోభనాద్రి యార్లగడ్డ నిర్మాతలు. రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో బాహుబలి చిత్రంలో కనపించనుంది. అన్నదమ్ములుగా రానా, ప్రభాస్ కనిపిస్తారు. రాజ్యంకోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. దాంతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోంది.

షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగేటట్లు ప్లాన్ చేసారు.
ఇక ఈ చిత్రం కథ అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











