»   » నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైం : రాజమౌళి

నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైం : రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ' నా కెరీర్లో మొట్ట మొదటిసారి ఒక సీన్ ని అనుకున్న టైం కంటే ముందే పూర్తి చేసాను. ముందుగా ఇందుకోసం 5 రోజులు అనుకున్నాం కానీ అన రోజుల్లోనే సినిమాని పూర్తి చేసామని' రాజమౌళి ట్వీట్ చేసాడు.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రాణా, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.


దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ఏది చేసినా అది సెనే్సషన్‌గా మారుతుంది. తాజాగా ఆయన రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్రంపై ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అంచనాలు పెంచడంలో ఆయనది అందెవేసిన చేయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఆర్‌ఎఫ్‌సిలో ఇటీవలే సాబు శిరిల్ రూపొందించిన ఎరీనా సెట్‌లో రాజవౌళి రెండున్నర కోట్ల భారీ వ్యయంతో ప్రభాస్‌కు అనుష్కకు నిశ్చితార్థం దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో రానా, రమ్యకృష్ణలతోపాటుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు.


ఈ ఒక్క సెట్‌కే రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చయితే ఇక మిగతా వాటి గురించి ఏ తరహాలో ఖర్చు చేస్తారో అన్న ఆలోచన టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. 'గ్లాడియేటర్' తరహాలో ఓ భారీ సెట్‌ను కూడా రాజవౌళి ఈ చిత్రం కోసం రూపొందించనున్నారట. దీంతోపాటు విలన్ డెన్, ఉద్యానవనాలు వంటివి కూడా సెట్టింగ్స్ వేస్తున్నారట. మొత్తంమీద ఎంత ఖర్చవుతుందో ఏమో మరి! వచ్చే ఏడాది ప్రేక్షకులకు ముందుకు వస్తున్న 'బాహుబలి' ఎంత గొప్ప రికార్డులను సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే అంటున్నారు.


దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

English summary
Rajamouli tweeted..." For the first time in my career I completed a scene much earlier then scheduled. Planed for 5 days, finished in 3 days…#panic …:)
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu