»   » 'బాహుబలి' కేరళ లొకేషన్ కబుర్లు (ఫోటో)

'బాహుబలి' కేరళ లొకేషన్ కబుర్లు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: రాజమౌళి, ప్రబాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ వాటర్ ఫాల్ దగ్గర షూటింగ్ చేద్దామనుకున్న రాజమౌళి..నీళ్లు పూర్తిగా లేక అనుకున్న ఎఫెక్ట్ రాక ఇబ్బంది పడవలిసి వచ్చింది. దాంతో వర్షం కోసం వెయిట్ చేసి చిత్రీకరించారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ లో తన అనుభవాన్ని రాసుకొచ్చారు.

    రాజమౌళి ట్వీట్ లో ...."మేం జలపాతం దగ్గర నీళ్లు ఉధృతంగా ఉండాలని ఆశించాం. భగవంతుడు మా మొర విన్నాడు. మా ప్రార్ధన ఫలించింది. వర్షం కురిసింది. " అన్నారు. డిసెంబర్ 3 వ తేదీ వరకు కేరళ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

    మరో ప్రక్క 'బాహుబలి' కోసం ఓ భారీ యుద్ధాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ప్రధాన తారాగణంతో పాటు రెండు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులపై యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దీనికోసం ఆరు నెలలు నుంచి చిత్రబృందం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. రెండు వేల మంది కళాకారులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఆ సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు నెలల పాటు చిత్రీకరించనున్నారు.

    ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ ''వచ్చే నెలాఖరు నుంచి 'బాహుబలి' యుద్ధం మొదలవబోతోంది. స్టోరీ బోర్డ్‌, ప్రి విజువలైజేషన్‌ వంటి పనులతో సన్నద్ధమవుతున్నాం'' అని తెలిపారు. దీనికి ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తారు.

    ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

    English summary
    
 Rajamouli tweeted..."Our day started off with a hope for pounding waters at the falls as we were waiting to resume Baahubali shoot. And Voila!! Our prayers were answered in no time."
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more