పవన్, జూ ఎన్టీఆర్, సునీల్ గురించి రాజమౌళి ట్వీట్

తన ప్రేమేయం లేకుండా ఈ వార్తలు ప్రచారంలోకి రావడంతో ఖంగుతిన్న రాజమౌళి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు నేను స్టోరీ చెప్పినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. అదే విధంగా బాహుబలి చిత్రంలో జూ ఎన్టీఆర్, సునీల్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలో కూడా నిజం లేదని స్పష్టం చేసారు.
ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి' షూటింగులో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











