»   » సమంత ఎకసెక్కాలు: గట్టిగా కౌంటర్ వేసిన రాజమౌళి!

సమంత ఎకసెక్కాలు: గట్టిగా కౌంటర్ వేసిన రాజమౌళి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి' సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్. ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లాంటి వారితో పాటు పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు. అయితే ఈ మధ్య కొందరు అభిమానులు సమంత కూడా ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వెలుబుచ్చారట. దీనికి సమంత సమాధానం ఇస్తూ...'నాకూ ఇందులో నటించాలని ఉంది కానీ. రాజమౌళి సార్ అవకాశం ఇవ్వలేదు' అంటూ ఎకసెక్కాలకు పోయింది సమంత.

దీంతో రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా గట్టిగా కౌంటర్ వేసారు. 'ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ సమంతా? బాహుబలి సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేయాలని నేను నిన్న పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసాను. కానీ నువ్వే డేట్స్ లేవని చెప్పావుగా. ఇపుడు ఇలా మాట్లాడటం నీకు తగునా? నీ వ్యాఖ్యల వల్ల నీ ఫ్యాన్స్ నా మీద కోపంగా ఉన్నారు' అంటూ ట్వీట్ చేసారు.

Rajamouli tweet about Samantha

ఇక బాహుబలి సినిమా విషయానికొస్తే...
రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కుతున్న 'బాహుబలి' చిత్రం అటు బడ్జెట్ పరంగా...ఇటు బిజినెస్ పరంగా అసలు అంచనాలకు అందడం లేదు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఖర్చు పెట్టి తీస్తున్న ఈచిత్రం....థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ సంచలనాలు రేకెత్తిస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే రూ. 175 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావు ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఫైన్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి పార్ట్-1 కోసం రూ. 45 కోట్లు, బాహుబలి పార్ట్-2 కోసం ఆయన రూ. 25 కోట్లు 2% వడ్డీకి ఫైన్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది.

ఈ చిత్రానికి సంబంధించిన సైడెడ్ రైట్స్ రూ. 13 కోట్లకు, బెంగుళూరు రైట్స్ రూ. 9 కోట్లకు అమ్మడు పోయినట్లు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నైజాం ఏరియా రైట్స్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రూ. 25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాహుబలి పార్ట్-1 కోసమే దిల్ రాజు ఈ మొత్తం ఖర్చు పెట్టాడట.

ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ....ఈ లెక్కలు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగేందుకు దోహద పడుతున్నాయి. మరి ఇదంతా సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు రాజమౌళి అండ్ టీం ప్లే చేస్తున్న పబ్లిసిటీ ట్రిక్సా? లేక నిజంగానే ఈ రేంజిలో బిజినెస్ జరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాటు విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్. మరి రాజమౌళి ప్రయత్నం సక్సెస్ అయి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని ఆశిద్దాం. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు.

English summary

 "Why r u doin this Sam?when I personally requested u for a spl role u said u had no dates.Now u r drivin ur fans against me" Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu