For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ సినిమాపై రాజమౌళి ట్వీట్

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజమౌళి తాజాగా ట్విట్టర్ లో సుడిగాడు ట్రైలర్ గురించి ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో...ఇప్పుడే సుడిగాడు ట్రైలర్ చూసాను. నవ్వుతూనే ఉండిపోయాను. మా ఇంట్లో అందరికీ చూపించాను. ఇది లాఫ్ రైట్ లా ఉంది అంటూ ట్వీట్ చేసారు. సుడిగాడు సినిమా ట్రైలర్ ని చూసిన రాజమౌళి చాలా ఇంప్రెస్ అయ్యి ఈ ట్వీట్ చేసారు.

    ఇక రాజమౌళి తాజా సూపర్ హిట్ చిత్రం ఈగ స్పూఫ్ ని సైతం సుడిగాడు లో పెడుతున్నారు. ఈగ మాదిరిగానే సుడిగాడు లో కూడా మొదట డైరక్టర్ వాయిస్ తో మొదలవుతుంది. ఈగలో దర్శకుడు రాజమౌళి..కూతురుకి కథ చెప్తున్నట్లుగా పెట్టినట్లుగానే ఇందులో బీమినేని శ్రీనివాసరావు..తన కూతురు కథ చెప్పమని అడిగితే ..తెలుగు హీరో కథ చెప్తానని,వాడిపేరు సుడిగాడు అని మొదలెడతారు. ఇలా సినిమా మొదటనుంచే స్ఫూఫ్ తో మొదలెడుతున్నారు.

    'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత. మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ అయి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

    ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం. విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇటీవలే కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం. అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్‌ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

    English summary
    Rajamouli tweeted.."Just watched sudigadu trailer Burst out laughing and am showing it to everyone at home...:) Looks Like a laugh riot.."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X