శ్వేతా బసు వ్యవహారం: మద్దతుగా రాజమౌళి ట్వీట్

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల వ్యభిచారం కేసులో పట్టుబడ్డ శ్వేతాబసు వ్యవహారంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. శ్వేతా బసు గురించి హిందీ టీవీ నటి సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు ఆయన తన మద్దతు ప్రకటించారు. తన్వర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఉందా? అంటూ ఆయన ట్వీట్ చేసారు.

సాక్షి తన్వర్ లేవనెత్తిన ప్రశ్నలు....
గతంలో ‘ఘర్ ఘర్ కి' అనే టీవీ సీరియల్‌లో సాక్షి తన్వర్ శ్వేతా బసు తల్లిగా నటించారు. శ్వేతా బసు వ్యవహారం గురించి ఆమె మాట్లాడుతూ శ్వేతాబసును ఒక్కరినే బలి పశువును చేశారని, ఆ క్షణంలో పట్టుబడ్డ బిజినెస్ మెన్ వదిలి వేయడం, అతని పేరును బయట పెట్టక పోవడం వెనక ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. శ్వేతా బసు వ్యవహారంలో మీడియా తీరును ఆమె తప్పుబట్టారు.

Rajamouli tweet about Swetha Basu affair

‘శ్వేతాబసు తల్లితో మాట్లాడాను. రిమాండ్ హౌజ్ లో శ్వేతాబసును సొంత తల్లి కలువడానికి కూడా నిరాకరించారని తెలిసింది. ఆమె తల్లి ఎంతగానో ఆవేదన చెందుతోంది. శ్వేతాబసు తల్లి పడుతున్న ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి కేసుల్లో పేర్లను గోప్యంగా ఉంచాల్సిన పోలీసులు బాధ్యత విస్మరించారు. కానీ వ్యాపారి పేరును మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచారు. పోలీసులు పక్షపాతంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు? అని ఆమె పశ్నించారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ శ్వేతబసు హాట్ అండ్ సెక్సీ లుక్: క్లిక్ చేయండి

తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు రేపిస్టులకు, హంతకులకు స్వేచ్చ కల్పిస్తున్న మనదేశంలో శ్వేతాబసు విషయంలో గోప్యంగా ఉంచాలనే నిబంధన పాటించడం లేదు. సున్నితమైన అంశాన్ని బజారుకీడ్చారు. ఇలా జరుగడం వెనక బాధ్యులు ఎవరు? మీడియా కథనాలకు మనస్తాపం చెంది తన కూతురు ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడితే దానికి ఎవరూ బాధ్యత వహిస్తారు? అని ఓ తల్లి లేవనెత్తే ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు? అంటూ సాక్షి తన్వర్ ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X