Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
‘వైఫ్ ఆఫ్ రామ్’ ట్రైలర్‌పై రాజమౌళి ప్రశంసల జల్లు
దర్శకుడు రాజమౌళికి సినిమాకు సంబంధించి ఏదైనా నచ్చిందంటే వెంటనే తన అభిప్రాయం వెల్లడిస్తూ ఉంటారు. ఆయన బావుందంటే చాలు.. ఖచ్చితంగా అందులో మంచి విషయం ఉన్నట్టే అని భావిస్తుంటారు ప్రేక్షకులు. తాజాగా రాజమౌళి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ పై తన అభిప్రాయం వెల్లడించారు.
వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్‌పై రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. ట్రైలర్ చూస్తుంటేనే ఇది న్యూ ఏజ్ థ్రిల్లర్ లా ఉందని పొగిడేశారు. టేకింగ్ ఇంటిలిజెంట్ గా ఉందని, ఇలాంటి కొత్త తరహా కథ ఎంచుకున్న దర్శకుడు విజయ్ యెలకంటికి, సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ పెట్టాడు రాజమౌళి..
Intriguing trailer... All the best to @VijayYelakanti. Nice that you chose a new age thriller for your debut. Wishing #WifeofRam team all Success. https://t.co/2aevDI9VuN
— rajamouli ss (@ssrajamouli) June 11, 2018
వైఫ్ ఆఫ్ రామ్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ తరహా కథలు మన దగ్గర ఇంత వరకూ రాలేదు. ఇంటెన్సివ్ గా సాగే కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చిత్ర టీమ్ ముందు నుంచీ చెబుతోంది. మొత్తంగా రాజమౌళిని మెప్పించిన వైఫ్ ఆఫ్ రామ్ ఆడియన్స్ నూ ఆకట్టుకోవడానికి త్వరలోనే విడుదల కాబోతోంది. వైఫ్ ఆఫ్ రామ్ గా మంచు లక్ష్మి నటించిన ఈ చిత్రంలో ఇంకా సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు : విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణనాయుడు, మాటలు : సందీప్ రెడ్డి గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.