»   » ‘బాహుబలి-3’ గురించి క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

‘బాహుబలి-3’ గురించి క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే ‘బాహుబలి' పార్ట్ 1 విడుదలైంది కూడా. త్వరలో బాహుబలి పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. అయితే ‘బాహుబలి' పార్ట్-3 కూడా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై రాజమౌళి ఈ రోజు ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

బాహుబలి అనే సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించాం. దాన్ని కేవలం రెండు పార్ట్స్ తో ముగించేయాలి అని అనుకోవడం లేదు. బాహుబలి పార్ట్ 3 కూడా త్వరలో ప్లాన్ చేస్తాం. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు మునుపెన్నడూ ఫీల్ అవ్వని అనుభూతిని ఇస్తుందని.. దాని గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేనను అన్నారు. ఈ విషయంలో రూమర్స్ నమ్మవద్దు. ఏ విషయం అయినా నేను స్వయంగా వెల్లడిస్తాను అన్నారు.

ప్రస్తుతానికి మా వద్ద బాహుబలి రెండు పార్టులకు సరిపడ స్టోరీ మాత్రమే ఉంది. ‘బాహుబలి- ది బిగెనింగ్' అనే సినిమాకి ‘బాహుబలి - ది కంక్లూజన్' అనేది పర్ఫెక్ట్ ఎండింగ్. మేము కథని కూడా అక్కడి వరకే ప్రిపేర్ చేసాం. కానీ బాహుబలి 3 అనేది కూడా భవిష్యత్తులో కచ్చితంగా ఉంటుంది అన్నారు రాజమౌళి.

వాస్తవానికి బాహుబలి సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని రాజమౌళి కూడా ఊహించలేదు. మరో వైపు ‘బాహుబలి' విదేశీ బాషల్లోనూ అదరగొడుతోంది. అందుకే మరిన్ని మార్పులు చేసి ఇటు ఇండియన్, అటు ఇంటర్నేషనల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట.'

స్లైడ్ షోలో రాజమౌళి ట్వీట్స్...

రాజమౌళి ట్వీట్స్


బాహుబలి పార్ట్ 3 గురించి వస్తున్న వార్తలపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

బాహుబలి పార్ట్ 3


భవిష్యత్తులో బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుందని స్పష్టం చేసారు.

క్లారిటీ ఇచ్చిన రాజమౌళి


ప్రస్తుతానికి తమ వద్ద రెండు పార్టులకు సంబంధించిన స్టోరీ ఉందని...బాహుబలి 1 కి బాహుబలి 2 పర్ ఫెక్టు ఎండింగ్ అని తెలిపారు.

బాహుబలి


త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని రాజమౌళి తెలిపారు.

English summary
"Many rumours on Baahubali-3..:) The story will conclude with part-2. No dragging..but the world of Baahubali will continue in a way that's Been never experienced before ever. Will reveal the details when appropriate.don't believe the rumours. Only I know what's going to come..:) Baahubali-3 is on cards...But the story that's written for the Looks Like I created more confusion instead of giving clarity..apologies..Two parts will not be dragged for the sake of it. This story will conclude with the second part itself.Baahubali-3 will be done in a way" Rajamouli tweeted.
Please Wait while comments are loading...