»   » ఫాల్స్ రికార్డులు మనకెందుకు ఫ్రెండ్స్: ‘బాహుబలి’పై రాజమౌళి

ఫాల్స్ రికార్డులు మనకెందుకు ఫ్రెండ్స్: ‘బాహుబలి’పై రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 50 రోజులు, 100 రోజులు, 175 డేస్ కాలం పోయింది. ఇపుడు సినిమాలు వేల సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి, 3, 4 వారాలకు మించి ఆడటం లేదు. బాహుబలి సినిమాకు సంబంధించి కొన్ని మెయిన్ స్క్రీన్లలో ఇంకా షేర్ వస్తోంది. చాలావరకూ బాహుబలి ప్రదర్శన ముగిసింది. కానీ కొందరు అభిమానులు ఈ చిత్రం ప్రదర్శన కాలం ఇంకా పెంచాలని కోరడం విచారకరం. కొన్నిసార్లు అభిమానులు వారి జేబుల్లోంచి డబ్బులు తీసి మరీ చిత్రాన్ని ప్రదర్శించాలని కోరుతున్నారు, మరికొన్నిసార్లు ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి ఫాల్స్ రికార్డుల వల్ల మనం ఏం సాధించుకుంటాం ఫ్రెండ్స్...? అంటూ ట్వీట్ చేసారు.

ప్రేక్షకులు మనకు మరిచిపోలేని విక్టరీ ఇచ్చారు. అది మన జీవితం మొత్తం గుర్తుండి పోతుంది. అంతకు మించి మనకు కావల్సింది ఏముంది? మన సినీ పరిశ్రమలో ఈ రకమైన(రికార్డుల గురించి) సమస్య చాలా కాలంగా ఉంది. అందులో మనమూ భాగం కావొద్దు. అలాంటి పరిస్థితులను ఆపాల్సిన అవసరం ఉంది. షేర్స్ వస్తున్న థియేటర్లలో బాహుబలి ప్రదర్శించడుతుంది. షేర్స్ రాని థియేటర్లలో బాహుబలి స్థానంలో ఇతర కొత్త సినిమా ప్రదర్శితం అవుతాయి. రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేయడం లాంటివి వద్దు అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.

రాజమౌళి కామెంట్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తం చేసారు. ఎవరైనా సరే ఫైనల్ కలెక్షన్ల మీదనే దృష్టిసారించాలి. నెంబరాఫ్ వీక్స్, డేస్ అంటూ కూర్చోవడం పాతకాలపు ఆలోచనే అవుతుందంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

English summary
"Record number of 50 days, 100 days,175 days are things of past. Today, Films are being released in 1000′s of screens and run is over by 3-4 weeks. Few main screens might still give shares, but mostly the run is over. It is very sad when some fans ask for an extension, sometimes paying out of their pockets and sometimes asking the exhibitors to do so. Friends..! what do we gain out of these false records?? Audience have given us a memorable victory, that we will remember for the rest of our lives." Rajamouli tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu