Just In
Don't Miss!
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Lifestyle
మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తుంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఐ’, ‘గోపాల గోపాల’ గురించి రాజమౌళి ఇలా...
హైదరాబాద్: రాజమౌళికి తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి గుర్తింపు ఉందో, ఇండస్ట్రీలో ఆయన రేంజి ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏదైనా సినిమా చూసి బావుందని ఒక్క ట్వీట్ చేసాడంటే చాలే ఆ సినిమాకు కలెక్షన్లు అమాంతం పెరిగి పోతాయి. ఆయన జడ్జిమెంటుపై ప్రేక్షకులుక అంత నమ్మకం మరి. ఆ మధ్య కొన్ని చిన్న సినిమాలు ఆయన రికమండేషన్ వల్ల కలెక్షన్లు పెంచుకున్నాయి కూడా.
తాజా తెలుగు బాక్సాఫీసు వద్ద సంక్రాంతి సందర్భంగా ప్రముఖ దర్శకుడు శంకర్, విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఐ' చిత్రంతో పాటు....‘గోపాల గోపాల' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలపై తనదైన రీతిలో స్పందించారు రాజమౌళి. రెండు గురించి పాజిటివ్‌గా స్పందించారు.

‘ఐ' సినిమా గురించి రాజమౌళి స్పందిస్తూ.....రివ్యూలు, టాక్ పూర్తి భిన్నంగా ఉన్నాయి. అయితే కలెక్షన్లు మాత్రం అసాధారణంగా ఉన్నాయి అని ట్వీట్ చేసారు. ‘గోపాల గోపాల' సినిమా టాక్ చాలా బావువుంది. లాంగ్ వీకెండ్ రెండు సినిమాలకు బాగా కలిసొస్తుంది. కొత్త సంవత్సరంలో ఫిల్మ్ బిజినెస్ ఆసక్తికరంగా మొదలైంది' అంటూ ట్వీట్ చేసారు.
రాజమౌళి తీరు చూస్తుంటే ఆచితూచి ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఎవరినీ నిరాశ పరచకుండా ఆయన ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ వల్ల ప్రేక్షకులు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ట్వీట్ ఫిల్మ్ సర్కిల్ లో చర్చనీయాంశం అయింది.