అందుకే రాజమౌళి ‘గబ్బర్ సింగ్’పై ఆలస్యంగా!
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎవరు మంచి పనితనం కనబరిచినా....తన మైక్రో బ్లాగింగ్ సైట్ల ద్వారా ప్రశంసలు, పొగడ్తలు చేసే దర్శకుడు రాజమౌళి....గబ్బర్ సింగ్ ఆడియో విడుదలై ఇన్ని రోజులైనా ఒక్కసారి కూడా స్పందించ లేదు. అసలు రెండు వారాలుగా ఆయన సోషల్ నెట్వర్కింగ్‌లో అందుబాటులో లేరు.
అయితే ఎట్టకేలకు ఇటీవల ట్వీట్ చేశాడు. 'దేవిశ్రీ ప్రసాద్ కెవ్వు కేక' అంటూ ట్వీటారు. కేక అంటూ ఆయన స్పందన బట్టి గబ్బర్ సింగ్ ఆడియోను ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు ప్రతిగా దేవిశ్రీ ప్రసాద్ రాజమౌళికి థాంక్స్ చెప్పారు.
ఈ రెండు వారాల పాటు ఎం చేశాననే విషయాన్ని కూడా రాజమౌళి వెల్లడించారు. అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఆసుపత్రిలో చేర్పించాం, రెండు వారాలుగా ఆమెతోనే ఉన్నాను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి 'ఈగ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈచిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధానప పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కొర్రపాటి వారాహి చలనచిత్రం పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన మంచి రెస్సాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











