'అందాల రాక్షసి' నెగిటివ్ టాక్ పై రాజమౌళి
దర్సకుడు మాట్లాడుతూ..ఎవరి అనుమతీ అవసరం లేదన్నట్టుగా... ఉదయం వాకిలి తీయగానే ఇంట్లోకి చొరబడతాడు సూర్యుడు. వెలుగుని పంచుతాడు. అచ్చం అలాంటి మనస్తత్వమే ఉన్న యువకుడు సూర్య. నలుగురికి సంతోషాన్ని పంచిపెట్టడంలోనే తన ఆనందాన్ని వెదుక్కొంటాడు. అందరూ వృథా అన్న వస్తువుకు కూడా ప్రాణం పోస్తాడు. అలాంటి యువకుడి జీవితంలోకి ఓ అందాల భామ వస్తుంది. మరి ఆ అమ్మాయిని రాక్షసి అని ఎందుకన్నాడో తెరమీదే చూడాలి. సినిమా ప్రారంభమైన రోజు నుంచి అత్యంత శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరూ చాలా నేచురల్‌గా నటించారు. నా నమ్మకమే నాకు శక్తినిచ్చింది. రాజమౌళిగారు, దిల్‌రాజుగారు ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందాల రాక్షసి హిట్టవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.
''నేను పోషించిన సూర్య అనే పాత్ర కోసం యేడాది పాటు కష్టపడ్డాను. ఇప్పటికీ ఆ పాత్రలోనే జీవిస్తున్నాన''న్నారు నవీన్‌చంద్ర. మంచి పాత్రల్లో, ఎంతో కష్టపడి చేశామని రాహుల్, లావణ్య అన్నారు. ఈ సినిమా పంపిణీ చేస్తున్న దిల్‌రాజు మాట్లాడుతూ ''చాలా రోజుల తర్వాత ఒక కొత్త తరహా సినిమాని చూసిన అనుభూతి కలిగింది. దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవారైనా హనుమంతు చక్కగా చిత్రీకరించాడు. విజయం సాధించాలని కోరుకుంటున్నా''అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జి.మురళి, సంగీతం: రధన్.'అందాల రాక్షసి'లో నవీన్‌చంద్ర, రాహుల్ హీరోలు, లావణ్య హీరోయిన్. సాయి కొర్రపాటి, ఎస్.ఎస్.రాజమౌళి నిర్మాతలు.


Click it and Unblock the Notifications












