‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాపై రాజమౌళి రివ్యూ

By Bojja Kumar

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే కాదు, బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులు రూపొందించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ మేకర్‌గా ప్రశంసలు అందుకున్నారు.. అలాంటి రాజమౌళి ఏదైనా సినిమా చూసి బావుంది అంటే... అది తప్పకుండా మంచి సినిమా అని ఫిక్స్ అయిపోతుంటారు ప్రేక్షకులు. ఆయన జడ్జిమెంటుకు అంత వ్యాల్యూ ఉంది మరి! తాజాగా 'ఈ నగరానికి ఏమైంది?' సినిమా చూసిన రాజమౌళి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Recommended Video

Ee Nagaraniki Emaindi Celebrity Response

తరుణ్ భాస్కర్ అదరగొట్టారు

‘తరుణ్‌ భాస్కర్‌ మరోసారి అదరగొట్టారు. నవ్వులతో కూడుకున్న ఎంతో ప్రశాంతమైన సినిమా. ‘ఈ నగరానికి ఏమైంది' టీంకు హృదయపూర్వక శుభాకాంక్షలు' అని రాజమౌళి ట్వీట్ చేశాడు.

ఆమె నటనకు ఇంప్రెస్ అయ్యా

సుధీర్‌బాబు ‘సమ్మోహనం' గురించి ట్వీట్ చేస్తూ... ‘‘సమ్మోహనం' సినిమాను కాస్త లేటుగా చూశాను. అదితి రావు హైదరి నటనకు ఇంప్రెస్ అయ్యాను. సుధీర్‌బాబు కూడా చాలా బాగా నటించాడు. నటుడు నరేష్ పాత్ర బాగా ఎంటర్టెన్ చేసింది. చిత్ర బృందానికి లేటుగా అభినందనలు' అని రాజమౌళి ట్వీట్లు చేశారు.

రాజమౌళి సినిమా కోసం ఎదురు చూపులు

రాజమౌళి సినిమా కోసం ఎదురు చూపులు

బాహుబలి తర్వాత రాజమౌళి నుండి ఎలాంటి సినిమా వస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీస్టారర్ మూవీని రాజమౌళి అనౌన్స్ చేశారు. #ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

2020లో విడుదల

2020లో విడుదల

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఈ భారీ మల్టీస్టారర్ 2020 సంక్రాంతికి విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X