ఇక షిర్డీ సాయి చేతుల్లో 'ఈగ': రాజమౌళి

By Srikanya

రాజమౌళి తాజా చిత్రం ఈగ ఈ రోజు(జూలై 6)న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ... ఈగ ఆన్ షిర్డీ సాయీస్ హ్యాండ్ అని ట్విట్టర్లో రాసారు. అంతేగాకుండా షిర్డీ సాయి ఫోటోగా నాగార్జున షిర్జీ సాయి గా చేసిన ఈ ప్రక్కనున్న ఫోటోని అప్ లోడ్ చేసారు. నిజంగా షిర్డీ సాయి మీద భక్తి మీదో లేక, నాగార్జున మీద అభిమానం మీదా ఈ ట్వీట్,ఫోటో పెట్టారని అని సందేహపడుతున్నారు. అందులోనూ కీరవాణి.. షిర్డీ సాయి చిత్రానికి పనిచేయటంతో ఆ చిత్రానికి, తన ఈగకి పబ్లిసిటీ క్రింద కూడా చేసి ఉండవచ్చని కొందరంటున్నారు.

షిర్డీ సాయి విషయానికి వస్తే... నాగార్జున తాజాగా 'శిరిడి సాయి' అనే భక్తి రస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కీ రోల్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ని ఈ నెల 30వ తేదీన జరపాలని నిర్ణయించారు. అలాగే ఈ ఆడియోను విభిన్నంగా హైదరబాద్ లోని షిర్డీ సాయి గుడిలో జరిగేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గత రాఘవేంద్రరావు, నాగర్జున కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు లాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

"వాసనలు వేరైనా, వర్ణాలు ఎన్నయినా పూలన్నీ ఒక్కటే. ప్రతి పువ్వు పూజించడానికి అర్హమైనదే అనేది సాయిబాబా ప్రబోధం. కులమతాలను త్యజిద్దాం, మనుషులంతా ఒక్కటే అనేది ఆ మాటల్లో అంతర్లీనంగా ఉన్న సత్యం. పరమాత్ముడు ఎక్కడో లేడు, పసిపాప మనసున్న ప్రతి వ్యక్తిలోనూ దేవుడున్నాడని బోధించారాయన. సాయి జీవనశైలి, ఆయన ఆధ్యాత్మిక చింతన యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. సాయి పాత్రలో నాగార్జున చక్కగా ఒదిగిపోయారు. కీరవాణి సంగీతం మరింత బలం తీసుకొచ్చింది" నాగార్జున అన్నారు.

సమత, మమత, ప్రేమ... లాంటి మానవతా భావనల గురించి జనావళికి చెప్పిన అవధూత షిర్డీ సాయిబాబా. 'ఆత్మవత్‌ సర్వభూతాని' అనే భగవద్గీత తత్వాన్ని చూపించి... మానవ రూపంలో ఉన్న దైవంగా భక్తుల పూజలందుకొన్నారు. బాబా బోధనలు, మహాత్మ్యాల్ని తెరపైకి తీసుకొస్తున్నారు కె.రాఘవేంద్రరావు. సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌ రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్‌, సంగీతం: కీరవాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X