Just In
Don't Miss!
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ ఫస్ట్ లుక్ పై రాజమౌళి కామెంట్
పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో అంటే దసరా రోజు విడుదలకాబోతోంది. ఈ నిర్మాతలు తమ ఫస్ట్ లుక్ ని దర్శకుడు రాజమౌళి కి చూపించారు. అది చూసిన రాజమౌళి తన ట్విట్టర్ లో ఈ విషయమై రాస్తూ...ఇప్పుడే నేను పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసాను. టెర్రఫిక్. ఫాన్స్ కి పండుగే ..ప్రొడ్యూసర్ శోభు గారు..నాకు ఇధి చూపించారు. త్వరలోనే వీటిని విడుదల చేయబోతున్నారు. విడుదలకు ముందు నేను పోస్ట్ చేయకూడదను ఆగుతున్నాను అన్నారు. ఇక ఈ నిర్మాతలకు రాజమౌళి గతంలో మర్యాదరామన్న చిత్రం రూపొందించారు. ఇక ప్రస్తుతం రాజమౌళి నాని,సమంత కాంబినేషన్ లో ఈగ చిత్రం రూపొందిస్తున్నారు.ఆ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఆ చిత్రం బిజెనెస్ వర్గాల్లో అప్పుడే మంచి క్రేజ్ క్రియోట్ చేసింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా ఓ చిత్రం రూపొందించటానికి రాజమౌళి రెడీ అవుతున్నారు.
తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న స్టైలిష్ ఎంటర్టైనర్ కి ఇప్పటివరకూ ఇంకా టైటిల్ ప్రకటించలేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అతని పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది. ఈ పాత్ర ఓ మాఫియా డాన్ ది కావటంతో ఆ పాత్రను పవన్ ఫిక్స్ చేసారు. పవన్ తన సినిమాల్లో మొదటి నుంచి తన పాత్రలకు వెరైటీ పేర్లు పెట్టడం తెలిసిందే. ఖుషీలో సిద్దు..సిద్దార్ద రాయ్ పేరు బాగా పాపులర్ కావటంతో మొన్న తీన్ మార్ లోనూ మైకెల్ వేలాయుధం అనే పేరు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఇలా రాబర్ట్ పేరుతో కనపించనున్నాడు. విజయదశమి పర్వదినం నాడు ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటించబోతున్నాం అంటున్నారు నిర్మాతలు తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థల ఆధ్వర్యంలో తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం కి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి.