ఎన్టీఆర్ దమ్ముని మెచ్చుకున్న రాజమౌళి

By Srikanya

రాజమౌళికి, ఎన్టీఆర్ కి ఉన్న సాన్నిహిత్యం సినీ అభిమానులకు తెలియంది కాదు. తాజాగా ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ముని మెచ్చుకుంటూ రాజమౌళి ట్వీట్ చేసి ఆ విషయం మరో సారి గుర్తు చేసారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలకు సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఆ పాటల గురించి రాజమౌళి ట్వీట్ చేస్తూ...ఎమ్.ఎమ్.కీరవాణి ఎప్పుడు అంతటి ఎనర్జీ ఉన్న పాటలను ఇవ్వటం నేను చూడలేదు. ఆ పాటల విన్నాక బోయపాటి మరోసారి మాస్ సినిమాని రీ ఢిఫైన్ చేస్తారని అనిపించింది. సినిమా గురించి ముందుగా మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను అన్నారు. ఇక రాజమౌళి ఈ చిత్రంలోని నాలుగు పాటలను విన్నారు.

ఇక ఈ చిత్రం కోసం రెండు షెడ్యులను ఎన్టీఆర్ ఇప్పటికే పూర్తి చేసారు. ప్రస్తుతం సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఊసరవిల్లి షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ లోనూ పాల్గొంటారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎన్టీఆర్, తమన్నా జంటగా నటించిన చిత్రం ఊసరవెల్లి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. విడుదలకు ముందే ఈ చిత్రం మంచి ఊపు అందుకుంది. భారీ గా అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ బ్రహ్మాండమైన రేటు ఇచ్చి దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X