»   » ఏదో చెబుతున్నట్టుగాఉంది.... రాజమౌళి కొత్త ముద్ర వెనక రహస్యం ఏమిటి?

ఏదో చెబుతున్నట్టుగాఉంది.... రాజమౌళి కొత్త ముద్ర వెనక రహస్యం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి కి ఒక ప్రత్యేకత ఉంది... తన పేరునే ఒక లోగో లాగా వేసుకుంటాడు... అదీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కనిపించే రౌండ్ సీల్ లాగా... మన మొహం మీదే గుద్దినంత ఎఫ్ఫెక్ట్ తో తెర మీద వస్తుంది. అయితే ఈ ముద్ర ని ఇప్పుడు మారుస్తున్నార..? తన లోగో లా ఉండే ఆ ముద్ర కి బదులుగా కొత్త ముద్రని రాజమౌళి ఎంచుకున్నారా అనే నుమానం కలుగుతోంది... ఎందుకంటే ఈ రోజు ఆయన తన ట్విటర్ లో ఇంకో సరికొత్త లోగోని పొస్ట్ చేసారు

పాత కాలం రాజముద్ర లా కనిపించే ఈ ఈ సింబల్ దేనికి సంకేతం? అన్న సందేహాలు తలెత్తాయి. రాజమౌళికి సొంత ట్రేడ్ మార్క్ ఉండగా, మళ్లీ ఈ సింబల్ ఏమిటి, ఎందుకు? అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. ఒకనాటి రాచముద్రలా...ఏదో సంకేత చిహ్నం లా ఉందీ ముద్ర...


Rajamouli Twitter profile picture is attracting every one...

రాజమౌళి ట్విటర్ లో తన ప్రొఫైల్ పిక్ లో ఇచ్చిన చిహ్నంలో రెండు గుర్రాల ముఖాలు ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఆ గుర్రాల మధ్యలో మెట్లదారి ఉంది. ఆ మెట్లు అంతమైన చోట సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి బ్యాక్ గ్రౌండ్ లో సూర్యుడి గుర్తు ....


టోటల్ గా ఈ చిహ్నం రాజమౌళి ఊహల్లో రూపుదిద్దుకున్న మాహిష్మతి దేశ రాజముద్ర అయి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. బాహుబలి, రాజుల కథ కాబట్టి ఈ చిహ్నం తయారు చేసి ఉండవచ్చని అంటున్నారు. ఇక ఈ ముద్రేమిటో...దాని కథేమిటో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే....జై మాహిష్మతీ అన్న స్లోగన్ తో బాటే ఈ ముద్రా రహస్యం ఏమిటో తెలిసి పోయేలా ఉంది..

English summary
Its an interesting news about S.S.Rajamouli who is sensational director in Telugu... that he changed Twitter profile picture is attracting every one...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu