twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఈగ'లో ఆ సీన్స్ క్లిష్టమైనవి: రాజమౌళి

    By Srikanya
    |

    ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'. షూటింగ్ ప్రారంభించి చాలా రోజులైనా ఇంకా ఒక కొలిక్కి రాలేదు.అయితే ఎప్పటికప్పుడు 'ఈగ'డిటేల్స్ ని అభిమానులకు అందచేసే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి. తాజాగా ఈ చిత్రం గురించి పోగ్రెస్ గురించి ట్వీట్ చేస్తూ. "ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి మరీ ఎక్కువ కాలం సమయం తీసుకోవాలని అనుకోవట్లేదు. అయితే మనుషులు, ఈగ మేళవింపుతో ఉండే సన్నివేశాలు రూపొందించడం క్లిష్టమైన వ్యవహారం. అయినప్పటికీ ఫిబ్రవరి నెలాఖరులో పాటల్నీ, ట్రైలర్లనీ, మార్చి చివరి వారంలో సినిమానీ రిలీజ్ చేయాలని సంకల్పించాం''అన్నారు.

    ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

    నాని, సమంత జంటగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో 'నాన్ ఈ' పేరుతో రూపొందుతోంది. అని చెప్పారు రాజమౌళి. ఈ చిత్రానికి సంగీతం:ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫౌల్డ్స్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ:ఎస్. రవీందర్, స్పెషల్ ఎఫెక్ట్స్: అడిల్, స్టైలింగ్: రమా రాజమౌళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.

    English summary
    SS Rajamouli tweets...Aiming to release eega and naanee in last week of march.audio and trailer to release by feb end.climax shoot in full swing. I know.i myself didn't expect dis film wud take so long.d process of integrating humans and eega is quite complicated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X