»   » ఫీలింగ్ ప్రౌడ్: ‘జనతా గ్యారేజ్’పై దర్శకుడు రాజమౌళి రి‘వ్యూ’...

ఫీలింగ్ ప్రౌడ్: ‘జనతా గ్యారేజ్’పై దర్శకుడు రాజమౌళి రి‘వ్యూ’...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తన సినిమాలతో బిజీగా ఉంటూనే..... రెగ్యులర్‌గా తెలుగులో విడుదలయ్యే సినిమాలు చూస్తుంటాడు, ఆయా సినిమాలపై తన అభిప్రాయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు.

ప్రేక్షకులు అంతగా రిచ్ కానీ కొన్ని మంచి చిన్న సినిమాలు... రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా ఇచ్చే రివ్యూల ద్వారా మంచి వసూళ్లు సాధించిన సందర్భాలు అనేకం. రాజమౌళి ఇచ్చే రివ్యూలపై ప్రేక్షకుల్లో అంత నమ్మకం ఉండబట్టే ఇదంతా సాధ్యం.


తాజాగా రాజమౌళి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' చిత్రాన్ని చూసారు. తెల్లవారు ఝామున 4 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లి ఏరియాలో వేసిన స్పెషల్ బెనిఫిట్ షో చూసిన అనంతరం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.


స్లైడ్ షోలో జనతా గ్యారేజ్ సినిమా గురించి రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా చెప్పిన అభిప్రాయాలు.....


రాజమౌళి

రాజమౌళి


కూకటపల్లిలో తెల్లవారు ఝామున జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో చూసేందుకు వస్తున్న దర్శకుడు రాజమౌళి.


జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్


జనతా గ్యారేజ్ లో నాకు బాగా నచ్చిన అంశం తారక్, మోహన్ లాల్ కాంబినేషన్. ఇద్దరి మద్య ఇంటెన్సిటీ చాలా బావుంది అని రాజమౌళి చెప్పుకొచ్చారు.


అదిరగొట్టారు

అదిరగొట్టారు


ఎన్టీఆర్, మోహన్ లాల్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టారు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ తన కెరీర్ ప్లానింగ్ చేసుకోవడం చూస్తుంటే గర్వంగా ఫీలవుతున్నాను అంటూ రాజమౌళి తెలిపారు.


రాజీవ్ కనకాల గురించి

రాజీవ్ కనకాల గురించి


గవర్నమెంట్ క్లర్క్ పాత్రలో నా ఫ్రెండ్ రాజీవ్ కనకాల హార్ట్ వార్మింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాను వరుసగా రెండు సార్లు చూసి చాలా ఎంజాయ్ చేసాను అని రాజమౌళి తెలిపారు.


English summary
"The combination of mohanlal garu and tarak, the subtle intensity betwen them is the best thing i liked about #JanathaGarage. It is a joy to watch both outperforming each other. Feel proud the way tarak is planning his characters and career since temper. My friend Rajeev Kanakala gives a heart warming performance as a sincere govt clerk. watched the film back to back twice and enjoyed it." Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu