మిస్టర్ ఫెర్ ఫెక్ట్ ను ఓ రేంజ్ లో చూపిస్తానంటున్న రాజమౌళి...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యస్ యస్ రాజమౌళిల తొలి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'ఛత్రపతి". ఈ చిత్రం హీరో ప్రభాస్ కు ఏ రేంజ్ విజయాన్ని అందించిందో..ఎంతటి పేరును తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం ప్రభాస్ ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రాబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం నాని, సమంతలతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఈగ" స్టార్ట్ చేసిన రాజమౌళి ఈ చిత్రం పూర్తయిన వెంటనే ప్రభాస్ తో 'బ్రహ్మార్షి విశ్వామిత్ర"ని రూపొందించనున్నాడు.
యంగ్ టైగర్ యన్టీఆర్ తో 'యమదొంగ" చిత్రం చేసేప్పుడు తన విశ్వామిత్ర బ్యానర్ లోగో కోసం ప్రభాస్ ని విశ్వామిత్రుడిగా చూపించిన రాజమౌళి..ఆ రూపం చూసే ప్రభాస్ కోసం 'బ్రహ్మార్షి విశ్వామిత్ర" కథను తయారు చేసుకున్నాడట. ఈ చిత్రం 2011 లో తెరపైకి రానుంది. రామ్ చరణ్ ని మగధీరుడిగా చూపించి సక్సెస్ సాధించిన రాజమౌళి..ప్రభాస్ తో ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ సమాచారం..


Click it and Unblock the Notifications











