24 గంటల్లో తొలిగించాల్సిందే లేదా కేసు పెడ్తాం...రాజమౌళి
సునీల్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్న సినిమా విడుదలై వారం కూడా కాకముందే అప్పుడే ఇంటర్నెట్ లో పైరసీ మొదలైంది. దీనిపై రాజమౌళి యుద్దం ప్రకటించారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా నాలుగు బృందాలని నియమించినట్లు రాజమౌళి చెప్పారు.ఈ విషయాలను ఆయన ట్విట్టర్ లో రాస్తూ..."ఇంటర్నెట్ లో 'మర్యాద రామన్న' వీడియో లింక్స్ ని క్రమం తప్పకుండా కనిపెట్టి, వాటిని తొలగించడానికి నాలుగు బృందాల్ని నియమించాం. ఏదైనా వీడియో లింక్‌ని కనిపెట్టిన వెంటనే వాళ్లు ఆ వెబ్ సైట్ కి లీగల్ నోటీసు పంపిస్తారు. సాధారణంగా ఆ నోటీసు అందుకున్న 24 గంటల్లో ఆ లింకుని వాళ్లు తొలగించాలి. అలా చేయకపోతే సైబర్ నేరం కింద వాళ్లమీద కేసు నమోదుచేసి, ఆ వెబ్‌సైట్‌ని మూసేయిస్తాం. ఇప్పటివరకు 'మర్యాద రామన్న'కు సంబంధించి 43 వీడియో లింకుల్ని తొలగింపజేశాం" అని తెలిపారు రాజమౌళి.


Click it and Unblock the Notifications











